Monday, April 29, 2024

ఏపీలో జగన్ పీనల్ కోడ్ న‌డుస్తోంది : నారా లోకేష్

కడప బ్యూరో : ఏపీలో జంగల్ రాజ్యం నడుస్తోందని, ఇండియన్ పీనల్ కోడ్ కాకుండా జగన్ పీనల్ కోడ్(జెపిసి)నడుస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కడప సెంట్రల్ జైల్ లో ఉన్న ప్రొద్దుటూరు తేలుగదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రవీణ కుమార్ రెడ్డిని మంగళవారం లోకేష్ పరామర్షించారు. అనంతరం అక్కడే విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్ ప్యాలస్ పిల్లి అని, ప్రజా సమస్యలపై తెలుగుదేశం నాయకులు ట్వీట్ లు పెట్టినా సహించలేక బయపడుతున్నారన్నారు. సమస్యల పై మాట్లాడితే జగన్ పారిపోతున్నారు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రివర్స్ లో నడుస్తుందని, పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2019లో జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 60 మంది టిడిపి నాయకులు, 5000 మంది టీడీపీ కార్యకర్తల పై కేసులు పెట్టారని పేర్కొన్నారు. అశోక్ జగపతి రాజు, అయ్యప్ప పాత్రుడు, అచ్చన్నాయుడు, జెసి దివాకర్ రెడ్డి, కొల్లు రవీంద్ర, బిటెక్ రవి చాలామంది టిడిపి నాయకులపై కేసులు పెట్టారన్నారు. తెలుగు దేశం నాయకులంటే ప్యాలస్ పిల్లి జగన్ ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్లేదన్నారు. దళితుల పై ఎస్సి, ఎస్టీ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిదన్నారు. టీడీపీ ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ చేసిన తప్పు ఏంటని ప్రశ్శించారు. ప్రవీణ్ ఇంటి పై వైసీపి కార్యకర్తలు దాడి చేసి మల్లీ కేసులు పెట్టారన్నారు.

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు పేరు బెట్టింగ్ రెడ్డి అని మార్చుకోవాలన్నారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలకు రాచమల్లు పాల్ప‌డుతున్నారన్నారు. జైల్ లో పెడితే టీడీపి కార్యకర్తలు, నాయకులు భయపడరని, భయం అనేది టీడీపీ బయో డేటాలో లేదని, ప్యాలెస్ పిల్లి జగన్ పెట్టె కేసులకు భయపడమన్నారు. జగన్ తో పాటు 151 మంది ఎమ్మెల్యేలను గద్దె దింపే వరకు టీడీపీ శ్రేణులు నిద్రపోరన్నారు. నందం సుబ్బయ్య ను హత్య చేసిందేవరో అందరికి తెలుసని, సొంత చిన్నాన్న హత్య కేసులో ముద్దాయిల్ని పట్టుకోలేని ప్యాలెస్ పిల్లి జగన్ అని విమర్శించారు. నిన్న పవన్ కళ్యాణ్ వైజాగ్ లో ప్రశాంతంగా యాత్ర చేస్తుంటే అడ్డగించారని అన్నారు. అమరావతి ఏపీ రాజధాని అని చెప్పింది జగన్ అని ఇప్పుడు జగన్ ఎందుకు యూ టర్న్ తీసుకుని మూడు రాజధానులు అని అంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయం పై దాడి చేసింది వైసీపీ కుక్కలేనన్నారు. కానీ కేసులు పెట్టింది మాత్రం టిడిపి శ్రేణుల మీద‌ ఇలాంటి వాటికి బయపడే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement