Friday, May 10, 2024

మోడీ చేతిలో చంద్రబాబు, జగన్, పవన్ కీలుబొమ్మలు : పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

కడప రూరల్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో చంద్రబాబు, జగన్, పవన్ కీలుబొమ్మలనీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు నగరంలోని ఇందిరా భవన్ లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీల అమలుకై కేంద్రాన్ని చంద్రబాబు జగన్ ఏనాడైనా ప్రశ్నించా రా అన్నారు. ఎన్నికల కోసమే పార్టీలను పెట్టుకున్నారా పొత్తులు ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆకలి కేకలు వినిపిస్తుంటే వాటి గురించి ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు. అక్రమాలు, అరాచకాలు ఎలా అరికట్టాలి వాటిపై ఎందుకు వారికి ఆలోచన లేదన్నారు. పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే రైతు ఆగ్రహంతో కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. నకిలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తండ్రి అమలు చేసిన పథకాలకు మంగళం పాడారని జగన్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. పోలవరంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ పూర్తి కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత జేడీ శీలం మాట్లాడుతూ వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను మోడీ తుంగలో తొక్కారు అన్నారు. ఆర్థిక పురోభివృద్ధి సాధించాలంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన మెరుగు పడాలన్నా రు పెట్రోల్ డీజిల్ ధరలు 10 తగ్గిస్తే తగ్గినట్లే ఎలా అవుతుంది అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదన్నారు జిఎస్టి వల్ల పరిశ్రమలు మూతబడి యువత రోడ్డున పడ్డారు అన్నారు. రాష్ట్ర విభజనలో యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ కు 26 వారాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కడపను వైఎస్ఆర్ కడప జిల్లా గా కొనసాగించాలని, మీటర్ల బిగించి రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement