Sunday, April 28, 2024

AP: అభ్య‌ర్ధుల‌కు బీఫామ్స్ అంద‌జేసిన జ‌న‌సేనాని

అందుకున్న 20మంది అసెంబ్లీ అభ్య‌ర్ధులు
ఇద్ద‌రు లోక్ స‌భకు పోటీ చేస్తున్న‌ స‌భ్యులు
హాజ‌రాకాని పాల‌కొండ అభ్య‌ర్ధి

మంగ‌ళ‌గిరి – సార్వత్రికల ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు ఇవాళ‌ బిఫామ్స్ అందించారు. మే 13న జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేయనుంది. జనసేన పార్టీ అభ్యర్థులు 21అసెంబ్లీ స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న జనసేనకు సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలను, రెండు లోక్ సభ స్థానాలను కేటాయించారు.

ఈ నేపథ్యంలో మొత్తం పోటీలో ఉన్న అభ్య‌ర్ధుల‌లో ఒక్క‌రికి మిన‌హా అంద‌రికీ మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కార్యాల‌యంలో ఇవాళ‌ జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ బీ ఫామ్స్ అంద‌జేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.. పాలకొండ నుంచి పోటీ చేస్తున్న‌ జయకృష్ణ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ కార్య‌క్ర‌మానికి హాజరుకాలేక‌పోయారు..

బీ ఫామ్స్ స్వీక‌రించిన అసెంబ్లీ అభ్య‌ర్ధులు…
నెల్లిమర్లలలో లోకం మాధవి, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ, రాజానగరంలో బత్తుల రామకృష్ణ, తెనాలిలో నాదెండ్ల మనోహర్, నిడదవోలులో కందుల దుర్గేష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు యలమంచిలిలో సుందరపు విజయ్‌కుమార్‌, పి.గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ, రాజోలులో దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, భీవరంలో పులివర్తి ఆంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్, ఉంగటూరులో పత్సమట్ల ధర్మరాజు, పోలవరంలో చిర్రి బాలరాజు, తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరులో శ్రీధర్‌, అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్ లు పోటీ చేస్తుండ‌గా వారంతా ఇవాళ బీ ఫామ్స్ అందుకున్నారు.

- Advertisement -

న‌వ‌శ‌కానికి నాంది పలుకుదాం … నాదెండ్ల మ‌నోహ‌ర్
అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు చాలా కీలకమని.. ప్రతిఒక్కరూ క్షేత్ర స్థాయిలో పర్యటనలు, ప్రచారం చేయాలన్నారు. ఈ ఐదేళ్లల్లో జరిగిన దాడులు, దారుణాలు ప్రజలకు వివరించాలన్నారు. పవన్ కల్యాణ్ మనపై నమ్మకంతో అవకాశం కల్పించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు మనమేం చేస్తామో, ఏమి చేయగలమో వివరించాలన్నారు. బీజేపీ, టీడీపీ నేతలను కలుపుకుని విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. తప్పకుండా నవ శకానికి నాంది పలికేలా అందరూ కలిసి పనిచేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement