Friday, December 6, 2024

Janasena – పిఠాపురంలో పవన్ జోష్ – వచ్చే వారం జనసేనాని పర్యటన


గెలిపించే బాధ్యత వర్మదే
టీడీపీ అధినేత ఆదేశం
త్రికూటమి దళాలతో భేటీ
పార్టీ క్యాడ‌ర్ తో ముఖాముఖి
నియోజకవర్గం స‌మ‌స్యల‌పై ఆరా
ముందుగా చేపట్టే ప‌నుల‌పై చ‌ర్చలు..
స్థానిక బీజేపీ, టీడీపీ నేత‌ల‌తో జ‌న‌సేనాని మంత్రాంగం

( ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం ప్రతినిధి)
ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తొలిసారిగా పిఠాపురం పర్యటనకు సర్వసన్నద్ధం అవుతున్నారు.. వచ్చే వారం పిఠాపురంలో పవన్‌ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెంచిన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు.. పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్‌ కల్యాణ్‌ వస్తుండడంతో అంతా ఆసక్తికరంగా మారింది.

పార్టీ క్యాడ‌ర్ తో ప్రత్యేక భేటీ..

ఇక, పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పెద్దసంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి… సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ తో ప్రత్యేకంగా ముచ్చటించ‌నున్నారు.. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్ లోని పనులుపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించనున్నారు. వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారని భావిస్తున్నారు…ఇక, గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు వచ్చాయట.. ఆ తర్వాత పర్యటనలో కూటమిలోని మూడు పార్టీలు (జనసేన, టీడీపీ, బీజేపీ)నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు బాధ్యత‌ల‌ను ఇక్కడి నంచి టిక్కెట్ ఆశించిన వ‌ర్మకు చంద్రబాబు నాయుడు అప్పగించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement