Friday, May 17, 2024

Jana Senani – చంద్ర‌బాబుకు బెయిల్ … సంపూర్ణ ఆరోగ్యం క‌ల‌గాల‌ని జ‌న‌సేనాని పవన్ ఆకాంక్ష..

అమ‌రావ‌తి – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించ‌డం ప‌ట్ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అలాగే ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యం కలగాలి అని కోరుకున్నారు .. “తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం” అన్న పవన్ కళ్యాణ్… “సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో చంద్రబాబు ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.
చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం అన్న పవన్ కళ్యాణ్.. “చంద్రబాబు నాయుడు గారి విడుదల కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం” అని అన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ని షరతులతో ఇచ్చింది. తిరిగి చంద్రబాబు నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో సూపరింటెండెంట్ ముందు స్వయంగా సరెండర్ కావాలని హైకోర్టు తెలిపింది. 53 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబుకి కంటి ఆపరేషన్ కోసం హైకోర్టు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సాయంత్రంలోగా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని తెలుస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు.. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్తారని తెలిసింది. అక్కడ కంటికి ఆపరేషన్ చేయించుకుంటారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement