Friday, May 17, 2024

Jana Sena – వైఎస్ఆర్ సీపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వబోం – పవన్ కల్యాణ్

మంగళగిరి – జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేశారంటూ నిప్పులు చెరిగారు.

దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ డాక్టర్ మహ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గరికపాటి వెంకట్‌.. జనసేనలో చేరారు. కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 సీట్లను గెలుస్తామంటూ వైఎస్ఆర్సీపీ అతిగా విశ్వసిస్తోందని ఎద్దేవా చేశారు. ఒక్క సీటులో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవకుండా చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ- జనసేనకు ఆ సత్తా ఉందని చెప్పారు.

ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కనీసం దశాబ్దం కాలం పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని, అప్పుడే విభజన మిగిల్చిన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ కల్యాణ్ అన్నారు. యువత, వీర మహిళల బలం వల్లే జనసేన పార్టీ నిలబడగలుగుతోందని పవన్ వ్యాఖ్యానించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement