Friday, April 26, 2024

శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడంపై నాదెండ్ల ఫైర్

జనసేన పార్టీ పిలుపునిచ్చిన రోడ్ల మరమ్మత్తు కార్యక్రమంలో పాల్గొనకుండా ఆపార్టీ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని అన్నారు. రోడ్ల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 27న డీజీపీకి శ్రమదానం కార్యక్రమం విషయం తెలిపామని వెల్లడించారు.  రాజమండ్రి అర్బన్‌ ఎస్పీ, అనంతపురం ఎస్పీలకు కూడా సమాచారం ఇచ్చామని తెలిపారు. శ్రమదానంలో పాల్గొనకుండా మా కార్యకర్తలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా శ్రమదానం కార్యక్రమం చేసి తీరుతామనని స్పష్టం చేశారు.

జనసేన కార్యక్రమాలకు మాత్రమే కరోనా రూల్స్ వర్తిస్తాయా? సీఎం జగన్ పర్యటనలకు వర్తించవా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి కోవిడ్ రూల్స్ ని ఎందుకు వర్తింపజేయలేదని నిలదీశారు. విజయవాడ నగరాన్ని దిగ్బంధించి వేలాది మందితో చెత్త వాహనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తే కరోనా రాదా? అని అడిగారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల రాష్ట్రంలోని రోడ్లన్నీ నాశనం అయ్యాయని, వాటిని జనసేన మరమ్మతులు చేస్తోందని నాదెండ్ల చెప్పారు.

ఇది కూడా చదవండిః IPL 2021: పంజాబ్‌ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement