Thursday, May 2, 2024

AP: రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన జగన్.. పల్లంరాజు

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు పల్లంరాజు విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ రెండవ సమావేశం గాంధీనగర్లోని ఆంధ్రరత్న భవనంలో నిర్వహించారు.

ఈసందర్భంగా కమిటీ చైర్మన్ పల్లంరాజు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దివాలా తీసే దిశగా తీసుకెళ్లారని విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో ప్రజాదరణ పొందేందుకు మేనిఫెస్టోలో చర్చించవలసిన ప్రాధాన్యత అంశాలపై చర్చించి మేనిఫెస్టో ఆమోదం కోసం అధిష్టానానికి పంపించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసాయని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, రెండు పోర్టులను ప్రైవేటీకరణ చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర రాజధాని అయోమయంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుల నుంచి విద్యార్థులు, మహిళలు, రైతాంగం, పరిశ్రమల అభివృద్ధి, నాలెడ్జ్ డెవలప్ మెంట్ దళిత, గిరిజన సంక్షేమం కోసం మంచి సలహాలు వచ్చాయన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలు తమతో పోత్తులో ఉన్నాయని తెలిపారు. వారితో చర్చించి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎన్. తులసి రెడ్డి, జంగా గౌతం, ఉషా నాయుడు, రమాదేవి, సాకే శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement