Tuesday, July 23, 2024

Meera Chopra: ప‌వ‌న్ “బంగారం” ఎక్క‌డ‌…

‘బంగారం’ బ్యూటీ మీరా చోప్రా గురించి పరిచయం అవసరం లేదు. కెరీర్ ఆరంభంలోనే అమ్మడు పవన్ సినిమాలో అవకాశం అందుకుని అటెన్షన్ డ్రా చేసింది. కానీ సొగసరి కెరీర్ టాలీవుడ్ లో అనుకున్నంత వేగం పుంజుకోలేదు. నాలుగైదు సినిమాలతో నిష్క్రమించింది. కోలీవుడ్ మాత్రం మీరాని కాస్త స్పీడప్ చేసినట్లు కనిపించింది. కానీ అక్కడా ఎంతో కాలం కొనసాగలేకపోయింది. మధ్య మధ్యలో బాలీవుడ్ లోనూ సినిమాలు చేసుకుంటూ వచ్చిందిగానీ..సక్సెస్ ఫుల్ కెరీర్ని అక్కడా బిల్డ్ చేసుకోలేకపోయింది.

- Advertisement -

ఇలా మూడు భాషల్లో నటించినా మీరానా ఏ లాంగ్వేజ్ బిజీ నటిగా మార్చలే కపో యింది. ఏడాదికో సినిమా చొప్పున..మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ గతేడాది వరకూ అమ్మడు ఎలాగూ నెట్టుకొచ్చింది. 2023 లో ‘సఫేద్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ సినిమా పెద్దగా ఆడలేదు.. కానీ బంగారం ఎప్పుడొచ్చినా ఇన్ స్టాలో మెరవాల్సిందే. ఆ రేంజ్ లుక్ తో ఫ్యాన్స్ మధ్య సందడి చేస్తుంటుంది. షోల్డర్ లెస్ న్యూడిజైన్స్ లో అమ్మడు తళకులీనుతుంది.

తాజాగా కుర్రాళ్లని కవ్విస్తూ బంగారం లాంటి డ్రెస్ లో బంగారం లాగే మెరిసిపోతుంది. గోల్డ్ కలర్ ఔట్ ఫిట్ లో అమ్మడు తళతళలాడిపోతుంది. అమ్మడి అలంకరణ అంతే హైలైట్ అవుతుంది. చేతికి వాచ్.. చెవులకు పెద్దవైన రింగులు ధరించింది. ఇక అమ్మడి నెయిల్ పాలిస్ మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఒక్కో గోరుకి ఒక్కో రంగు వేసింది. బ్లాక్ అండ్ లైట్ కలర్ నెయిల్ పాలిస్ పూసింది. కళ్లకి దండీగా ఐటెక్స్ అద్దింది. ఇక బ్యూటీ మేనిమ ఛాయలో ఎలాంటి మార్పులు రాలేదు. నాటి బంగారం లాగే మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement