Friday, May 3, 2024

విమాన ప్రయాణికులు గుడ్ న్యూస్.. కడప నుంచి ఇండిగో సర్వీసులు

ఏపీ విమాన ప్రయాణికులు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి దక్షిణ భారతదేశంలోని ఐదు నగరాలకు మార్చి 27 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. మార్చి 27 నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

కడప-చెన్నై, కడప-విజయవాడ, కడప-బెంగళూరు, కడప-విశాఖపట్నం, కడప-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో పేర్కొంది. కడప-చెన్నై, కడప-విజయవాడ, కడప-హైదరాబాద్ రూట్లలో మార్చి 27 నుండి విమానాలు ప్రారంభం కానున్నాయి. కడప-బెంగళూరు, కడప-విశాఖపట్నం రూట్లలో సర్వీసులు మార్చి 29 నుండి ప్రారంభమవుతాయి. కాగా, ఇండిగో విమాన సర్వీసులు అందిస్తున్న నగరాల్లో దేశంలో 73వ నగరంగా కడప ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement