Wednesday, May 22, 2024

AP: ఓన‌మాలు మాత్ర‌మే నేర్చుకుంటే ఇక తెలుగు అంత‌మే – వెంక‌య్య నాయుడు

కాకినాడ – ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవు అని హెచ్చరించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా 30వ వార్షికో త్సవం సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా కాకినాడలో ఈ రోజు, రేపు రెండు రోజులపాటు అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు.. కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరుగుతోన్న ఈ సదస్సును నేడు ఆయ‌న ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య మాట్లాడుతూ, తెలుగు భాషలో వస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఎబ్బెట్టు ,వెట‌కారం ఎక్కువైంది..

కొందరు భాష చాలా ఎబ్బెట్టుగా, వెటకారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వాలు దురదృవశాత్తు సాహిత్యాన్ని ప్రోత్సహించడం లేదన్నారు.. ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు భాష ఆనవాళ్లు కూడా ఉండవన్నారు. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఇక, 45 ఏళ్లు విరామం లేకుండా రాజకీయాలు చేశాను అని గుర్తుచేసుకున్నారు.. మాతృ భాష తల్లి లాంటిది. తెలుగు శతకాలు అలవాటు చేస్తే పిల్లలు బాగుపడతారు అని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement