Monday, April 29, 2024

ఆనందయ్య మందుపై దుష్ప్రచారాలు వద్దుః కాకాణి

ఆనందయ్య ఆయుర్వేద మందుపై దుష్ప్రచారాలు చేయడం బాధాకరం అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ విభాగం పరిశీలించిందన్నారు. ఐసీఎంఆర్, కేంద్ర ఆయుష్ బృందం రేపు వస్తుందని తెలిపారు. ఈ మందుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి పెట్టారని చెప్పారు. అందుకోసమే అధికారులను ఇక్కడికి పంపించి అధ్యయనం చేస్తున్నారని వివరించారు. శాస్త్రీయ లోపాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయంపై దృష్టి పెట్టారని చెప్పారు. ఆనందయ్యని అరెస్ట్ చేయడం, నిర్బంధించటం వంటి పనులు ఎవ్వరు చేయరని స్పష్టం చేశారు. కరోనాని అరికట్టడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనన్నారు. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, కొద్ధి రోజులు ప్రజలు ఓపిక పట్టాలని కోరారు.

మరోవైపు ఇప్పటికే ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మందు తయారీలో హానికర పదార్థాలు లేవని చెప్పారు. ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని తెలిపారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement