Thursday, March 28, 2024

ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌‌పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో సదరు యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే అక్కడే ఉన్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో అంబులెన్స్‌లో యువతిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువతి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి కిందకు దూకడంతో కాళ్లకు, వెన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కాగా యువతి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement