Tuesday, May 21, 2024

భారీ ప్ర‌క్షాళ‌న – ఒకేసారి 57 మంది ఐఏఎస్‌ అధికారుల బ‌దిలీ…

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను భారీ సంఖ్యలో బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 57 మంది ఐఐఎస్‌ అధికారులను ఒకేసారి బదిలీ చేసింది. వీరిలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు కూడా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన సుమారు నాలుగేళ్ళ కాలంలో ఇంతమంది ఐఏఎస్‌లను ఒకేసారి బదిలీ చేయటం ఇదే తొలిసారి. కార్మిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న జి.అనంతరామును మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్‌.పి సిసోడియాను మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ గా బదిలీ చేశారు. జెన్‌కో సీఎండీ బి. శ్రీధర్‌ను ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీగా బదిలీ చేశారు. ఐ.టి.ఈ కార్యదర్శి సౌరభ గౌర్‌ను ఏపీ భవన్‌ (న్యూఢిల్లి)రెసిడెంట్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తన్న రిటైరయిన ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాధ్‌ దాస్‌ను రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కోన శశిధర్‌ను ఐ.టి.ఈ అండ్‌ సి కార్యదర్శిగా నియమించారు. కె. హర్షవర్దన్‌ కు ఏపీ ఎస్‌.సి కమిషన్‌ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం.వి శేషగిరిబాబును కార్మిక శాఖ కమిషనర్‌ గా నియమించారు. దేవాదాయ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌ ను కార్మిక, ఫ్యాక్టరీ, ఇన్సూరెన్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌ శాఖ కార్యదర్శిగా నియమించారు. మున్సిపల్‌ పరిపాలనా విభాగం కమిషనర్‌, డైరెక్టర్‌ గా ఉన్న‌ ప్రవీణ్‌ కుమార్‌ ను ఏపీఐఐసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా నియమించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషణ్‌ మనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణను దేవాదాయ శాఖ కమిషనర్‌ గా బదిలీ చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ గా ఉణ్న పి.బసంత్‌ కుమార్‌ ను ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎం.డిగా, విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి కమిషనర్‌ గా, నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కె.వి.ఎన్‌ చక్రధర్‌ బాబును ఏపీ జెన్‌ కో ఎం.డిగా, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎంహరి నారాయణ్‌ ను నెల్లూరు జిల్లా కలెక్టర్‌ గా, అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మిని విజయనగరం జిల్లా కలెక్టర్‌ గా. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డిని సీసీఎల్‌ జాయింట్‌ సెక్రటరీగా, ఏ.పీ.ఎస్‌.సీ.ఎల్‌ ఎండిగా ఉన్న సగిలి షాన్‌ మోహన్‌ ను చిత్తూరు జిల్లా కలెక్టర్‌ గా, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ ఎస్‌.శ్రీజనను కర్నూలు జిల్లా కలెక్టర్‌ గా బదిలీ చేశారు.

బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయను సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ గా, కష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషాను బాపట్ల జిల్లా కలెక్టర్‌ గా బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జి.క్రిస్ట్‌ కిషోర్‌ కుమార్‌ ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఏలూరు జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబును శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ గా బదిలీ చేశారు. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ సీఈవోగా ఉన్న‌ ఎం.గౌతమిని అనంతపురం జిల్లా కలెక్టర్‌ గా, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ గా ఉన్న‌ బి.లావణ్య వేణని ఏలూరు జిల్లా కలెక్టర్‌ గా బదిలీ చేశారు. సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌ ఎం.విజయసునీత మహళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ గా బదిలీ అయ్యారు.

- Advertisement -

ఐఏఎస్‌ అధికారి ఏ.సిరిని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా బదిలీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా పనిచేస్తున్న జె.వెంకట మురళిని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ గా బదిలీ చేశారు. కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రమా సుందర్‌ రెడ్డిని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా బదిలీ చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సి.ఎం సాయికాంత్‌ వర్మ జీవీఎంసీ కమిషనర్‌ గా బదిలీ కాగా.. అన్నమయ్య జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తమీన్‌ అన్సారియాను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో వెల్లడించారు. విజిలెన్స్‌ జాయింట్‌ సెక్రటరి చమకురి శ్రీధర్‌ ను ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా బదిలీ చేశారు.


చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఏపీవీవీపీ కమిషనర్‌ గా బదిలీ అయ్యారు. వి.వినోద్‌ కుమార్‌ ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ఎం.డిగా బదిలీ అయ్యారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ బి.నవ్య ఎంప్లాయ్‌ మెంట్‌,ట్రైనింగ్‌ డైరెక్టర్‌ గా నియమితులయ్యారు. ఎన్‌.టి.ఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా పి.సంపత్‌ కుమార్‌ నియమితులయ్యారు. సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీ జి.గణష్‌ కుమార్‌ వైఎస్‌ ఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా నియమితులయ్యారు. ఓ.ఆనంద్‌ ను విశాఖపట్నం రెవెన్యూ (సీటీ) జాయింట్‌ కమిషనర్‌ గా నియమించారు. తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ అనుపమ అంజలిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఉత్తర్వులిచ్చారు.

తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గా నరపురెడ్డి మౌర్య నియమితులయ్యారు. సీతంపేట ఐటిడిఏ పీవోగా కల్పనాకుమారిని నియమించారు. ఎస్‌.ఎస్‌.ఏ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావును ఎస్‌.ఎస్‌.ఏ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ గా నియమించారు. కర్నూల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అమిలినేని భార్గవ తేజను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి అడిషనల్‌ డైరెక్టర్‌ గా నియమించారు. ఏపీ భవన్‌ (న్యూ ఢిల్లిd) అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ #హమాంశు కౌషిక్‌ ను అన్నమయ్య జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా నియమించారు. ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ పధ్వితేజ్‌ ఇమ్మడి ఏపీఈపీడిసీఎల్‌ సీఎండీగా నియమితుయల్యారు. అనకాపల్లి జాయింట్‌ కలెక్టర్‌ గా ఎం.జాహ్నవి, పాడేరే సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ ను పాడేరు ఐటీడీఏ పీవో గా నియమించారు. కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌, చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా పి.శ్రీనివాసులు, ఫైనాన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ డిప్యూటీ సెక్రటరీగా ఎం.అభిషిక్త్‌ కిషోర్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గా ఉన్న ఎస్‌.సురేష్‌ కుమార్‌ ను ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ గా, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌, ఎం.డిగా ఉన్న జి.వీరపాండియన్‌ కు సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement