Thursday, April 25, 2024

నిరుద్యోగుల‌లో ఆశ‌లు.. పోలీసుశాఖలో ఖాళీల భర్తీ ఈ ఏడాదేనా?

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.. ముఖ్యంగా పోలీసుశాఖలో ఖాళీల భర్తీ కోసం నిరీక్షిస్తున్న ఆశావాహులైన యువత కలలు ఈ ఏడాదే నెరవేరబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. గత మూడేళ్ళుగా పోలీసుశాఖలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ ఉూసే లేకపోవడంతో ఆసక్తి క లిగిన అభ్యర్ధులు నిరుత్సాహంతో ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఇటీవల రెండు విడత లుగా అక్కడి పోలీసుశాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 16వేల పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మన రాష్ట్రంలోని పోలీసుశాఖలో చేరగోరు యువతలో మరింత నిరాశక్తత ఏర్పడింది. రాష్ట్రంలో పోలీసుశాఖను సిబ్బంది కొరత పట్టి పీడిస్తుందన్న అంశం పలుమార్లు తెరమీదకు రావడంతో అటు ప్రభుత్వంలోనూ.. ఇటు ప్రజల్లోనూ చర్చ కొనసాగుతోంది. కేవలం ఇంటర్‌, డిగ్రీ చదివిన విద్యార్ధులే కాకుండా ఎంబిఏ, ఇంజనీ రింగ్‌ వంటి పెద్ద చదువులు చదివిన యువత కూడా పోలీసుశాఖలో అడుగుపె ట్టేందుకు ఆశక్తి కనబరుస్తున్నారు. ఇందుకోసం పట్టణాలు, నగరాల్లో వేలకు వేలు చెల్లిస్తూ కోచింగ్‌లు కూడా తీసుకుంటున్నారు.

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు చెందిన చదువుకున్న యువత కూడా పోలీసు ఉద్యోగాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్న క్రమంలో తమ ఉూరు విడిచి విశాఖ, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు వంటి ప్రాంతాలకు వచ్చి రూములు అద్దెకు తీసుకుని ఉంటూ కోచింగ్‌ పొందుతున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతాలకు చెందిన యువత కూడా పోలీసు వైపే మొగ్గు చూపుతూ ఇప్పటి నుంచే శిక్షణ పొందుతున్నారు. పోలీసుశాఖలో సిబ్బంది కొరత ఉంది అనే సమాచారంతో ఎప్పటికైనా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వకపోదా అనే నిరీక్షణతో ఉన్నారు. పోలీసుశాఖలో సిబ్బంది కొరత మాట వాస్తవమేనని ఇటీవలే ఓ సందర్భంలో హోం మంత్రి తానేటి వనిత అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుశాఖలో ఖాళీలు భర్తీ చేసే అంశంపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఇటీవల జరిగిన విలేఖరుల సమావేశంలో డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీంతో పోలీసుశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధుల ఆశలు చిగురించినట్లైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement