Friday, May 17, 2024

భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ: జనసేనాని పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన ఉల్లాసకరమైన పండుగ హోలీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వసంత రుతువులో వచ్చే ఈ పండుగను వసంతోత్సవంగా జరుపుకొనే ఈ వేడుక వేళ దేశ ప్రజలందరికీ తన తరపున, జనసేన తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో వివిధ పేర్లతో, వివిధ పురాణాల నేపథ్యంలో ఈ పండుగ జరుపుకొంటు-న్నప్పటికీ భారతీయలు ఐక్యతకు ప్రతీకగా హోలీ శతాబ్దాల తరబడి విరాజిల్లుతోందని పేర్కొన్నారు.

రంగులు, పూల సమ్మేళనంతో నిండి ఉండే ఈ పండుగలానే ప్రజలందరి జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖ శాంతులు విరబూయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ పండుగను ప్రకృతి పరంగా లభించే సహజ సిద్ధమైన రంగుల మిశ్రమాలతో జరుపుకోవాలని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement