Wednesday, May 1, 2024

Heat Waves – తిరుమలలో విచిత్రం – భక్తుల కాళ్ల‌కు గోనె సంచులు

తిరుమల దారుల్లో ఊహించనంత టెంప‌రేచ‌ర్లు
భ‌గ్గుమంటున్న సూర్యుడు.. మండిపోతున్న కొండ‌లు
కాలిబాట దారిలో భ‌క్తుల‌కు తీవ్ర అవస్థలు

తిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. తిరుమల కొండపై విపరీతంగా ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం సమయంలో ఎండను చూస్తే నిప్పుల కొలిమిలా అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాట కూల్ పెయింట్ కొన్ని చోట్ల వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొందరు భక్తులు ఆ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు ఇలా కాళ్లకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే జూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ కూల్ పెయింట్ వేసి వేసవి ఉపశమన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement