Monday, April 29, 2024

రాష్ట్రంలో భగభగలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తునిర్వహణ సంస్థ సూచన

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. ఇవ్వాల (శనివారం) అత్యధికంగా కడపలో 41.5, తుని 41.6, కర్నూలు, ఒంగోలు 41.3, నంధ్యాల 41, బాపట్ల 40.7, జంగమేశ్వరపురం 40.2, అమరావతి 40చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లాలో 10, కాకినాడ 2, విజయనగరం 1 మండలంలో తీవ్రవడగాల్పులు, వేర్వేరుజిల్లాల్లో 55 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి.

ఐఎండి అంచనాల ప్రకారం ఆదివారం కూనవరం, నాతవరం, కోటనందూరు, జీయమ్మవలస, కొమరాడ ప్రాంతాల్లోతీవ్ర వడగాల్పులు అల్లూరి జిల్లా 10, అనకాపల్లి 17, తూర్పుగోదావరి 17, ఏలూరు17, గుంటూరు12, కాకినాడ 13, కోనసీమ 4, కృష్ణా 9, నంద్యాల 8, ఎన్టీఆర్‌ 16, పల్నాడు 7, పార్వతీపురంమన్యం 9, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 3, విజయనగరం 22, పశ్చిమ గోదావరి 1,వైఎస్‌ఆర్‌ 1 మండలంలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఎండల తీవ్రత, వడగాల్పుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement