Monday, April 29, 2024

1998 డీఎస్సీ అభ్యర్థుల్లో సంతోషం.. సీఎం జగన్​కు కృతజ్ఞతలు

1998లో డీఎస్సీ రాసిన పలువురు అభ్యర్థులు అప్పట్లో ఉద్యోగం పొందలేకపోయారు. పలు కారణాల వల్ల అప్పటి ప్రభుత్వం వీరిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో అప్పటి నుంచి జాబ్​లోకి తీసుకోవాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో వీరికి జరిగిన అన్యాయం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రలు విడిపోయిన తర్వాత ఏనిమిదేండ్లకు న్యాయం జరిగింది. తెలంగాణలో సీఎం కేసీఆర్​ 1998 డీఎస్సీ అభ్యర్థులకు జాబ్​ ఇస్తన్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

కాగా, ఈ మధ్యనే ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డి కూడా వారి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీంతో 1998 డీఎస్సీ అభ్యర్థుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ క్రమంలో సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఇవ్వాల కలిసిన కొంతమంది అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. 24 ఏళ్లనాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని జగన్​ వద్ద కన్నీరుపెట్టుకున్నారు. సీఎంని సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement