Saturday, May 4, 2024

కెఎల్ యు లోఎన్ సిసి రాత పరీక్షలు…606 మంది అభ్యర్థులు హాజరు…

తాడేపల్లి,ఫిబ్రవరి19(ప్రభ న్యూస్) కెఎల్ విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియం లో ఆదివారం నాడు ఎన్ సిసి అభ్యర్ధులకు సి సర్టిఫికేట్ కొరకు రాత పరీక్షలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎన్.సిసి గ్రూప్ కమాండర్ కల్నల్ ఆర్.జయకుమార్ అద్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు జిల్లాలకు చెందిన పలు కళాశాలల నుండి సుమారు 606 మంది విద్యార్ధిని, విద్యార్ధులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎన్.సిసి గ్రూప్ కమాండర్ కల్నల్ ఆర్.జయకుమార్ మాట్లాడుతూ విద్యార్ధులకు ఉద్యోగాల సమయంలో మెరిట్ మార్కులకు ఎన్ సిసి అందించే సి సర్టిపికేట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.


ఈ రోజు జరిగిన రాత పరీక్ష ఫలితాలు నెల రోజుల లో వెలువడతాయని ఆంధ్రప్రదేశ్ 10వ బెటాలియన్ ఎన్ సిసి అధికారి పావని అన్నారు. పాసయిన వారికి సి సర్టిపికేట్ అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. కెఎల్ విశ్వవిద్యాలయంతో పాటు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం, వివిఐటి, గోరంట్లకు చెందిన సియంట్ మేరీ కళాశాల, గుంటూరుకు చెందిన హింధూ కళాశాల, చీరాలకు చెందిన వైఎ డిగ్రీ కళాశాల వంటి ప్రముఖమైన కళాశాలలకు చెందిన 606 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ ఆర్.పి.సింగ్, కల్నల్ అజయ్ కుటినో, కల్నల్ కుమార్ ఉమాశంకర్, గుర్నాం సింగ్, అసోసియేట్ ఎన్ సిసి అదికారిణులు లెప్టినెంట్ ఉషాక్రాంతి, పావనిలతో పాటు విశ్వవిద్యాలయం తరుపున విద్యార్ధి వ్యవహారాల డీన్ డాక్టర్ చప్పిడి హనుమంతరావు, డీన్ సలహాదారులు డాక్టర్ కెఆర్.ఎస్.ప్రసాద్, డాక్టర్ హబీబుల్లాఖాన్, సమన్వయకర్త చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement