Saturday, May 4, 2024

సాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలుతీసుకోండి ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల ఫిబ్రవరి 21(ప్రభ న్యూస్)రైతులకి సాగునీరు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాటిపదికన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్కేఇరిగేషన్ అధికారులని ఆదేశించారు. మండల పరిధిలోని పేరుకలపూడి పంట కాలువ
మరమ్మత్తులు జరుగుతున్న ప్రదేశాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. మోరంపూడి తుమ్మపూడి ప్రధాన కాలువ కట్ట రోడ్ లోని పేరుకలపూడి ఛానెల్ హెడ్ స్లూయిస్ వద్ద పెద్ద గొయ్యి ఏర్పడింది.రైతులకి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే ఆర్కేఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులను చేపించారు. శాశ్వత పరమత్తులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులని ఆదేశించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే వెంట ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు , పేరుకలపూడి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement