Friday, March 29, 2024

కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి

పెదకూరపాడు – కరోనా రెండవ దశ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని, తగు జాగ్రత్తలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని, వ్యాధి తీవ్రత నుంచి బయటపడవచ్చునని స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు., గుంటూరులోని శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ ఎవ్వరికైనా జ్వరం, ఒళ్ళునొప్పులు, దగ్గు, జలుబు వంటి ఏ ఒక్క లక్షణం కనబడినా మొదటి రోజు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనబడిన మొదటిరోజే కుటుంబ సభ్యులకు, ఇతరులకు దూరంగా ఉంటూ, రెండు మాస్కులు ధరించి, చేతులు సబ్బుతో గాని, శానిటైజర్ తో గాని శుభ్రం చేసుకోవాలన్నారు, లక్షణాలు కనబడిన మొదటి రోజే మీ సమీపంలోని ఆరోగ్య కార్యకర్త ను గాని, ఆశావర్కర్ ని గాని, వాలంటీర్ ను గాని కలిసి సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే శంకరరావు సూచించారు, కరోనా నిర్దారణ అయితే ఇతరులకు, కుటుంబ సభ్యులకు సోకకుండా విడిగా ఉంటూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, కరోనా నివారణకు అవసరమైన మందుల కొరకు ఎవరూ ఇబ్బంది పడకూడదని తన సొంత నిధులతో ప్రతీ గ్రామానికి కరోనా మందుల కిట్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు, వ్యాది లక్షణాలు కనబడిన వారు ఆరోగ్య కార్యకర్త ద్వారా ఉచిత మందుల కిట్ తీసుకొని నివారణ పొందాలని ఆకాక్షించారు, జ్వరం ఇతర లక్షణాలు నాలుగు రోజులు పైబడి తగ్గక పోయినా, ఆయసం వస్తున్నా సమీపంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందాలని, ఏమాత్రం కూడా అశ్రద్ద వహించద్దన్నారు,ముఖ్యంగా కరోనా వ్యాధి లక్షణాలు కనబడిన మొదటి రోజు నుంచే జాగ్రత్తలు వహిస్తూ మందులు వేసుకుంటూ, అవసరమైన పరీక్షలు వైద్యులను సంప్రదించి చేయించుకుంటే, తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో బయటపడవచ్చునని ఎమ్మెల్యే శంకరరావు తెలిపారు, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నావారు ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని, ఆక్సిజన్, రెమ్ డీసివర్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్లు వంటి మందులు వాడాల్సి వస్తుందని. కనుక ముందుగానే వ్యాధి నిర్ధారించుకొని మందులు వాడలని ఎమ్మెల్యే శంకరరావు సూచించారు, నా నియోజకవర్గంలో ప్రజలు ఎవరూ కూడా మందులకోసం ఇబ్బంది పడకూడదని మండల కేంద్రాలలో కరోనా నివారణకు అవసరమైన మందులు ఉచితంగా ఒక కిట్ రూపంలో ఉంచడమైనదని అవ్వి ఆరోగ్య కార్యకర్త ల ద్వారా లక్షణాలు కనిపించిన మొదటి రోజే ఉచిత కిట్ తీసుకొని మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోని కరోనా పై పోరాటం లో విజయం సాధించాలని ఎమ్మెల్యే శంకరరావు ఆకాక్షించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement