Thursday, May 2, 2024

నాణ్యతా లోపం.. కూలిన మేజర్ డ్రైన్ గోడలు..

పొన్నూరు, మే 2 ప్రభ న్యూస్ : ప్రభుత్వం నిధులు రూ.10 లక్షలతో ప్రారంభించిన మేజర్ డ్రైన్ నిర్మాణం పూర్తికాకముందే డ్రైన్ గోడలు దెబ్బతిన్నాయి. 80 మీటర్లు పొడవునా ఈ మేజర్ డ్రైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వహణ కరువై మురుగు కాలువ గోడలు పడిపోయాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు 26వ‌ వార్డు గాజులపాలెంలో కూలిపోయిన మురుగు కాలువ గోడలను సందర్శించారు. నాణ్యతా ప్రమాణాలు లోపించటం, గడ్డ కట్టిన సిమెంట్ బస్తాలు వాడటం వల్లనే వర్షానికి మురుగు కాల్వ గోడలు బీటలు వారి నేలకూలాయని ఆరోపించారు.

స్థానిక మున్సిపల్ కమిషనర్ డాక్టర్ రాధారెడ్డి, ఇన్చార్జి మున్సిపల్ డీఈ ఏడుకొండలు, ఇన్చార్జి ఏఈ గౌతమి కూలిపోయిన మురుగు కాలువ గోడ‌ను సందర్శించారు. మూడు రోజుల క్రితం మురుగు కాలువ నిర్మాణం చేయటంతో పాటు, రాత్రి కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువ గోడలు పచ్చిగా ఉండి పడిపోయాయని తెలిపారు. పడిపోయిన మురికి కాలువ గోడల నిర్మాణం పూర్తిగా తిరిగి కాంట్రాక్టర్ నిర్మాణం చేయాలని ఆదేశించామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement