Thursday, April 25, 2024

గుంటూరు గుంట‌గ్రౌండ్ ఎగ్జిబిష‌న్ లో భారీ అగ్నిప్ర‌మాదం

గుంటూరు నడిబొడ్డున ఉన్న గుంటగ్రౌండ్ ఎగ్జిభిషన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నాజ్ సెంటర్ లో గుంటగ్రౌండ్ లోని యస్ యస్ ఎగ్జిభిషన్ లో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు పెద్దఎత్తున గుంటగ్రౌండ్ కు చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కొత్తపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శీలం శ్రీనివాసులు రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఐదు అగ్నిమాపక వాహనాలతో మంటలని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంలో ఒక బైక్ పూర్తిగా దగ్దమైపోయింది. ఎంట్రీ ఎదురుగా షెడ్డు పూర్తిగా 1000 అడుగుల మేర తగలపడి పోయింది. సుమారు 4,5, లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. ఈమధ్యకాలంలో జియంసి అధికారులు ఎగ్జిబిషన్ ను సీజ్ చేయడంతో ప్రజలు, పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. కొన్ని ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, అనుమతుల నిరాకరణ వంటి వాటి వల్ల ఇప్పటికే రెండు సార్లు జియంసి అధికారులు ఎగ్జిబిషన్ ను సీజ్ చేశారు. ప్రమాద విషయం తెలియడంతో ఘటనా స్థలానికి గుంటూరు ఈస్ట్ డిఎస్పీ సీతారామయ్య చేరుకుని అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో ప్రమాదాన్ని తక్కువ సమయంలో నివారించేశారు. ఈసందర్భంగా ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతూ… అనుకోకుండా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినట్లుoదని, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న సీసీ కెమెరాల వీడియో ఫుటేజీ ఆధారంగా సాక్షాదారాలు సేకరిస్తామని, ఎగ్జిబిషన్ పార్ట‌న‌ర్లు ఈప్రమాదం కావాలనే కొందరు చేసారని, ఆరోపిస్తున్నారని, దీనిపై విచారిస్తామని డిఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement