Thursday, April 25, 2024

చార్ ధామ్ యాత్ర – ఆరు రోజుల్లో 20మంది మృతి

మే 3వ తేదీన చార్‌ధామ్ యాత్ర మొదలైంది. మొదలైన ఆరు రోజుల్లోననే 20 మంది యాత్రికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్‌తో మరణించారట‌. హృద్రోగ సమస్యలతోపాటు ఎత్తైన ప్రాంతాల గుండా ప్రయాణించడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. 14 మంది యాత్రికులు యమునోత్రి, గంగోత్రి ధామ్‌లలో మరణించారు. ఇందులో ఒక నేపాలీ కార్మికుడు కూడా ఉన్నాడు. వీటితోపాటు కేదార్‌నాథ్‌లో ఐదుగురు, బద్రినాథ్‌లో మరొకరు మరణించారని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఆరు రోజుల్లో 20 మంది యాత్రికులు మరణించార‌ని చెప్పారు. ఈ పరిణామంపై యాత్ర నిర్వాహకులు, పాలకులు ఆందోళనలు చెందుతున్నారు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు కేదార్‌నాథ్, యమునోత్రి ధామ్‌కు వెళ్లడానికి కఠినమైన దారుల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల గుండా ప్రయాణించడంతో వారు ఆక్సిజన్ కొరత, కోల్డ్‌తో బాధపడుతారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో యాత్ర చేస్తున్న హై బీపీ, డయాబెటిస్, క్యాన్సర్, ఆస్థమా పేషెంట్ల ఆరోగ్యం దారుణంగా క్షీణిస్తుంది. చార్ ధామ్ యాత్ర మార్గంలో భక్తుల కోసం ప్ర‌యివేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందించే ఉచిత ఆరోగ్య సేవలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement