Thursday, December 7, 2023

ఏరువాక సాగేనా, క్షేత్ర స్థాయిలో కానరాని ‘భరోసా’

నంద్యాల (ప్రభన్యూస్‌): నూతన జిల్లా నంద్యాలలో ఏరువాక సాగుపై అనిశ్చితి నేలకొంది. జిల్లాలోని పలు జలాశయల్లొ నిండుకున్న నీటి నిల్వలు… ఎండిన చెరువులు, తగ్గిన భూగర్భ నీటిమట్టం… నకిలి విత్తనాల భయం, విజిలెన్స్‌శాఖ అసమర్థత… ఖరీఫ్‌ సమీపిస్తున్న గ్రామాల్లో కానరాని వ్యవసాయ సిబ్బంది.. ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన రైతులకు భరోసా ఇవ్వలేని రైతు భరోసా కేంద్రాలు.. వెరసి ఏరువాక సక్రమంగా సాగేనా అన్న గుబులు అన్నదాత గుండెల్లో గూడుకట్టుకుంటోంది. ఏటికేడు వ్యవసాయం గుదిబండలా మారుతున్నప్పటికి శ్రీశైలం, అలగనూరు, తెలుగుగంగ, కెసీకెనాల్‌కు కేంద్రమైన నంద్యాల జిల్లా నూతన వ్యవసాయశాఖ ముఖచిత్రం తీరుపై అన్నదాత గంపెడు ఆశలు పెట్టుకున్న కానీ జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధత తీరు చూస్తుంటే పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందాన ఉంది.

ఏరువాక సమీపిస్తున్నప్పటికీ రైతులకు అవగహన కార్యక్రమం చేపట్టాల్సిన అధికారులు ఆచూకి లేరు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుకలో సక్రమమైన యాజమాన్య పద్ధతులు, సలహాలు, క్షేత్రస్థాయిలో లేకపోవడంతో, సబ్సీడి ద్వారా ఇచ్చే పరికరాలు, విత్తనాలు ప్రభుత్వం ఇవ్వాని నేపథ్యంలో అన్నదాతను ఖరీఫ్‌ మరింత ఆందోళనకు గురిచేస్తుంది. వరిరైతు పరిస్థితి మరి దయనీయం.. నంద్యాల జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి పంటను సాగు చేయడం జరుగుతుంది. దిగుబడి అంతంత మాత్రమే కావడంతో ఖర్చు అధికమై వరిసాగుకు ప్రస్తుత్త ఖరీఫ్‌లో రైతులు ముందుకు రావడం లేదు. ఏకరాకు గత ఖరీఫ్‌లో 35 బస్తాలు దిగుబడి రాగా రూ.35వేల మేరకు ఖర్చు కాగా ప్రస్తుత్త ఖరీఫ్‌కు వరి సాగుకు రైతులు వెనకాడుతున్నారు. కౌలు రైతులు గత సంవత్సరం ఖరీఫ్‌లో ఎకరాకు 10 బస్తాల చొపున యజమానికి కౌలు చెల్లించేవారు. వరి సాగు గిట్టుబాటు కాకపోవడంతో ప్రస్తుత్త ఖరీఫ్‌కు ఏకరాకు 3 బస్తాలు చెల్లించడానికి కూడా ముందుకు రావడం లేదు. వరితో పాటు మొక్కజొన్న తదితర పంటలు సరైన దిగుబడి రాకా అప్పులు అధికం కావడంతో అప్పులు తీర్చలేక, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలను ఆర్థికంగా ఆదుకొవడానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ రైతు భరోసా యాత్ర చేస్తుండడం అన్నదాత బతుకు చిత్రానికి నిదర్శనం.
జిల్లా వ్యవసాయ అధికారి ఆంధ్రప్రభతో మాట్లాడుతూ ఖరీఫ్‌ సాగుకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా ఉందమన్నారు. సిజన్‌లో వరి కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుమన్నారు. జిల్లా పంటసాగు వివరాలతో పాటు, ఖరీఫ్‌కు అవసరమైన రసాయనిక ఎరువుల వివరాలను తెలియజేశారు.

- Advertisement -
   

పంట విస్తీర్ణం హెక్టార్లలో ఖరీఫ్‌కు అవసరమైన రసాయనిక ఎరువులు
వరి 67,890 మెట్రిక్‌ టన్నులలో
మొక్కజొన్న 39,035 యూరియ – 60,339
శనగ 39,131 డిఏపి – 22,504
పెసలు 7,884 ఏమ్‌ఓపి – 6,789
పత్తి 22,410 ఏన్‌పికెఎస్‌ – 95,827
వేరుశనగ 17,897 ఏస్‌ఏస్‌పి – 2,605
మిరప 7,012 కంపోస్ట్‌ – 3,253
ఇతర పంటలు 28,225
మొత్తం 2,28,984

Advertisement

తాజా వార్తలు

Advertisement