Friday, May 3, 2024

క‌రోనా క‌ట్ట‌డికి ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు….ర‌వాణ శాఖ‌, ఆర్టీసీల‌ను ప్ర‌శ్నించిన హైకోర్టు..

అమరావతి, : కోవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో విపత్తుల నిర్వహణ చట్టం కింద పలు మార్గదర్శకాలతో జారీ చేసిన జీవో నం. 138 అమలులో భాగంగా ఏ చర్యలు తీసుకుంటు-న్నారో వివరిం చాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ, ఏపీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం పూర్తి వివ రాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్‌ జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు- ఆర్టీసీ, ప్రైవేటు- బస్సులను 50 శాతం సీట్ల ఆక్యుపెన్సీతో మాత్రమే నడిపేలా ఆదేశించాలని కోరుతూ నెల్లూరు నవాబుపేటకు చెందిన న్యాయవాది జీవీఎస్‌ఎస్‌ శ్రీకాంత్‌ పార్టీ ఇన్‌ పర్సన్‌ గా వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ దుర్గప్రసాదరావు ఇరుపక్షాల వాదనలు విన్నారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వ న్యాయవాది(రవాణాశాఖ) కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) కిందకు వస్తుందని, పిటిషనర్‌ అభ్యర్థనను ఆర్టీసీ పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అనంతరం న్యాయమూర్తి పిటిషన్లోని అభ్యర్థనను పరిశీలించి, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందకు వస్తుందని, దీనిపై పిటిషనర్‌ శ్రీకాంత్‌ వివరణ ఇవ్వాలని కోరారు. పిటిషనర్‌ శ్రీకాంత్‌ స్పందిస్తూ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రయోజనాలు ఏవీ లేవని, కేంద్ర మార్గదర్శకాల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో జీవో 133 జారీ చేసిందని, కానీ జీవోను అమలు చేయడం లేదన్న దే తన అభ్యంతరమని వివరిం చారు. ప్రభుత్వం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అధికా రులకు ఈ అంశంపై వినతిని పంపినా.. ఎలాంటి వివరణ రాలే దని తెలిపారు. ఆర్టీసీ తరఫున న్యాయవాది దుర్గాప్రసాద్‌ స్పందిస్తూ విమానాలు, రైళ్లు పూర్తి సీట్ల సామర్థ్యంతో, అలాగే సినిమా హాళ్లు, రెస్టారెంట్లు- యథాతథంగా నడుస్తున్నాయని వివరించారు. పిటిషనర్‌ ఆర్టీసీని మాత్రమే 50 శాతం సీట్ల కెపాసిటీ-తో బస్సులు నడపాలని కోరుతున్నారని, వాస్తవానికి ఆర్టీసీ కోవిడ్‌ నియం త్రణకు అన్ని జాగ్రతలు తీసుకుంటోందని తెలిపారు. బస్సు లో సీట్ల కెపాసిటీ- మేర మాత్రమే ప్రయాణికులను అనుమ తిస్తున్నామని, నిలబడి ప్రయాణించేందుకు అనుమతిం చడం లేదని స్పష్టం చేశారు. ఈ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ విమానాలు, రైళ్లు పూర్తి సామర్థంతో నడుస్తున్నా యనే పేరుతో ప్రభుత్వ జీవోలోని మార్గదర్శకాలను అమలు చేయకుండా మినహాయింపు కోరలేరని స్పష్టం చేశారు. జీవో ప్రకారం ప్రజా ప్రయోజనాలనే చూడాలన్న న్యాయమూర్తి ప్రస్తుతం ఏ చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని రవాణాశాఖ, ఆర్టీసీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement