Saturday, March 23, 2024

ఆగని రుణ యాప్ ల వేధింపులు.. వివాహిత బలి

రుణ యాప్ ల వేధింపులు అంతా ఇంతా కాదు. ఆమె చనిపోయినా వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రుణ యాప్ ల వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన బండ పల్లి ప్రత్యుష (24) ఇంటిపైన ఇనుప ఫ్లెక్సీ ప్రేమ్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులు, భర్తకు ప్రత్యూష సెల్ఫీ వీడియో పంపింది. మృతురాలు ప్రత్యుష పుట్టినిల్లు మచిలీపట్నం శారదా నగర్. కృష్ణా జిల్లా గంటశాల మండలం సెకెనేపల్లికి చెందిన భర్త రాజశేఖర్ ఏపీఐసీసీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. 6 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, చినకాకాని హైలాండ్ రోడ్ లో నివాసముంటున్నారు.

మృతురాలు ప్రత్యుష ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో రూ.20 వేల లోన్ తీసుకోగా.. 8 వేలు బకాయి ఉంది. రెండు రోజుల నుండి ఆమెకు రుణ యాప్ ల కాల్ సెంటర్ నుండి వేధింపులు మొదలయ్యాయి. న్యూడ్ ఫోటోలు నీ కాంటాక్ట్ నంబర్స్ కు పెడతామని బెదిరించారు.. తీవ్ర మానసిక వేదన కు గురైన ప్రత్యుష ఆత్మహత్య కు పాల్పడింది. ప్రత్యుషా ఆత్మహత్యకు పాల్పడినా.. ఉదయం నుండి ఆమె ఫోన్ కు, వాట్సాప్ ద్వారా వేధింపుల కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె సెల్ వాట్సాప్ కాంటాక్ట్స్ కు ఆమెను అసభ్యంగా కించపరుస్తూ సందేశాలు పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement