Friday, April 26, 2024

నగర వీధులలో చెత్త సేకరణ కాలువలు శుభ్రం తప్పనిసరి – నగర కమిషనర్

గుంటూరు సిటీ – నగర వీధులలో రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకొని పాటు ప్రతి ఇంటి నుండి చెత్త ను తప్పనిసరిగా సేకరించాలని అదేవిధంగా మురుగు కాలువ లో మురుగును ప్రతి రోజూ శుభ్రం పరచాలని నగర కమిషనర్ చల్లా అనురాధ పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో ఆమె పర్యటనలో భాగంగా ఆమె వెంట మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. శ్రీనగర్ ఆదర్శ నగర్ లో ఆమె పర్యటించి మురుగు కాలువల్లో చెత్తా పేర్కొని ఉండడాన్ని గ్రహించి శానిటరీ ఇన్స్పెక్టర్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో త్రాగునీరు సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఇంజనీర్ సెక్షన్ ఏఈ ని ఆదేశించారు. సచివాలయం పరిధిలో ప్రతిరోజు ఏమినిటీ కార్యదర్శులు త్రాగునీరు సరఫరా సమయంలో క్లోరిన్ శాంపి ల్స్ తీసుకొని నీటి నాణ్యత పరిశీలించాలని ఆమె ఆదేశించారు. శ్రీనగర్ ఆదర్శనగరంలో నూతనంగా డ్రైవింగ్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు అదేవిధంగా నగరంలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆమె అన్నారు. రోడ్లు కాల్వల నిర్మాణం జరిగేటప్పుడు అడ్డుకున్న విద్యుత్ స్తంభాలను తొలగింపునకు విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పనులను వేగవంతం చేయాలన్నారు. కాల్వలపై ఎటువంటి అక్రమ కట్టడాలు చేపట్టకుండా ఉండేవిధంగా ఆధార్ అలలపై ఎటువంటి అక్రమ కట్టడాల తో పాటు క్యాంపింగ్ ఏర్పాటు చేయకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. కాళ్ళ పై ఉన్న కట్టడాలను తొలగించుటకు సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి ఇంటి నుండి చెత్తను సేకరించి సమయంలో సచివాలయ పారిశుద్ధ్య సెక్రెటరీ తప్పనిసరిగా ఐడీ కార్డులను ధరించి ప్రతి గృహం నుండి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా సేకరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలు శుభ్రపరచు కపోతే ఆ స్థలాలను కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంటుందని సంబంధిత యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా కాలువలలో రోడ్లపై చెత్త ని వేసే వారిని గుర్తించి వారి వద్ద నుండి అపరాధ రుసుము తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement