Saturday, October 12, 2024

అమ్మవారికి రు.2లక్షల బంగారపు హారం బహుకరణ

అమృతలూరు,మార్చి 5(ప్రభన్యూస్ ) : శ్రీ అమృతేశ్వర స్వామి దేవాలయాన్ని దాతలు భక్తుల సహకారంతో అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ ఎంపీపీ మేనేని రత్నప్రసాద్ తెలిపారు.
మండల కేంద్రం అమృతలూరు శ్రీ అమృతేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి దాతలు 2 లక్షలు విలువచేసే బంగారపు కాసుల గొలుసుని ఆలయ అర్చకులకు అందజేశారు. ఆదివారం ఉదయం అమృతలూరు శ్రీ అమృతేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో కారువంచి స్వర్ణలత కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్,భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె అల్లుడు డాక్టర్ మౌనిక,డాక్టర్ సాయికిరణ్ దంపతుల సహకారంతో బంగారపు గొలుసును అమ్మవారికి బహూకరించారు. కార్యక్రమంలో పావులూరి రత్నాంబ, మల్లిపెద్ది కమలమ్మ, పరుచూరి ఉదయలక్ష్మి, క్రొత్తపల్లి శార్వాణి, మైనేని బాలవాణి, వేనిగళ్ళ నిర్మల, మల్లెపెద్ది స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement