Friday, April 26, 2024

డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పనులు ఆలస్యం.. అంబటి రాంబాబు

పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో పనులు ఆలస్యమవుతున్నాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై మంత్రి అంబటి రాంబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిందన్నారు. మానవ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందన్నారు. వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కు భారీ నష్టం జరిగిందన్నారు. గుంతలు పూడ్చేందుకు 45లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేయాలన్నారు. రూ.2వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement