Friday, April 26, 2024

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సిబ్బంది ఉరుకులు పరుగులు …

అమ‌రావ‌తి – ఏపీలో పరిషత్ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే రేపు జరుపుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వ‌డంతో దాంతో అధికారులు, సిబ్బంది ఎన్నికల ఏర్పాట్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఎన్నిక‌ల జ‌రుగుతాయ‌నే ముందు చూపుతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సిబ్బంది, రూట్ అధికారులు నేటి ఉద‌యం నుంచే మండ‌ల కేంద్రాల వ‌ద్ద‌కు చేరుకున్నారు.. ఎన్నిక‌ల‌కు సంబంధించిన మెట‌రియ‌ల్ ను సైతం తీసుకున్నారు.. అయితే పోలింగ్ కేంద్రాల‌కు వెళ్ల‌కుండా డెలివ‌రీ కేంద్రాల‌లో ఉండిపోయారు.. హైకోర్టు పోలింగ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో యుద్ద‌ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌ల సిబ్బందిని పోలీంగ్ కేంద్రాల‌కు అధికారులు త‌ర‌లిస్తున్నారు.. అక్క‌డ బూత్ ఏర్పాటు చేసుకోవ‌డం, బ్యాలెట్ ప‌త్రాలు స‌రిగా ఉన్నాయో లేదో చూసుకోవ‌డం, బ్యాలెట్ బాక్స్ ల సీళ్లు స‌రిచేసుకోవ‌డం, గ‌దుల్లో లైటింగ్, బెంచ్ ఏర్పాట్ల వంటివి ఈ సిబ్బంది చూసుకోవ‌ల‌సి ఉంది.. దీంతో అంతా హ‌డావిడి ప‌డుతున్నారు.. అలాగే పోలీస్ సిబ్బంది కూడా పోలీంగ్ కేంద్రాల‌కు త‌ర‌లివెళుతున్నారు.. కాగా, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,82,15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 38 జడ్పీటీసీ, 601 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 494 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖ జిల్లాలో 38 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీ స్థానాలకు, తూర్పు గోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, 1004 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 జడ్పీటీసీ, 790 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 44 జడ్పీటీసీ, 654 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరు జిల్లాలో 46 జడ్పీటీసీ, 579 ఎంపీటీసీ స్థానాలకు, ప్రకాశం జిల్లాలో 41 జడ్పీటీసీ, 394 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరు జిల్లాలో 34 జడ్పీటీసీ, 366 ఎంపీటీసీ స్థానాలకు, చిత్తూరు జిల్లాలో 35 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు, కడప జిల్లాలో 12 జడ్పీటీసీ, 118 ఎంపీటీసీ స్థానాలకు, కర్నూలు జిల్లాలో 37 జడ్పీటీసీ, 492 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురం జిల్లాలో 63 జడ్పీటీసీ, 791 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అవ‌స‌ర‌మైతే ఈ నెల తొమ్మిదో తేదిన రీపోలింగ్ నిర్వ‌హిస్తారు… ఇక 10వ తేదిన బ్యాలెట్స్ లెక్కించి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement