Thursday, April 25, 2024

తమ్ముడిని తొక్కేస్తున్న మెగాస్టార్ !!

ఇంకో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం థియేట్రికల్ హక్కులు 23 కోట్ల కు, సీడెడ్ హక్కులు 12 కోట్లకు, ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు 10 కోట్లకు అమ్ముడు పోయాయి. అలాగే ఆంధ్రా లోని పశ్చిమ గోదావరి జిల్లా హక్కులు 7 కోట్లకు, కృష్ణా జిల్లాలో 6కోట్లకు, నెల్లూరు జిల్లా 3.35 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి థియేట్రికల్ హక్కులు నాలుగు కోట్ల మేర అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక ఓవర్ సీస్ లో 5 కోట్లుకు అమ్ముడు పోగా, నిర్మాతలు సొంతంగా ఆరు కోట్లకు హక్కులను రిలీజ్ చేసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్ల మేర జరిగినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో నడుస్తోంది. నైజాంలో ఇప్పటికే వరంగల్ శ్రీను 42 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, సీడెడ్ కలిపి 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరుగుతుంది. మరోవైపు ఓవర్సీస్ లో కూడా చిరు ఏ మాత్రం తగ్గట్లేదు. అక్కడ 20 కోట్లకు పైగానే ఓవర్సీస్ బిసినెస్ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది.

ఇదే కానీ నిజమైతే ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల వరకు ఉన్నట్టే. కాగా పవన్ వకీల్ సాబ్ తో పోల్చుకుంటే మెగాస్టార్ ప్రీ రిలీజ్ బిసినెస్ లో ముందజులోనే ఉన్నట్లు అర్థం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement