Tuesday, April 30, 2024

తిరుప‌తి త‌ర్వాత ఆ న‌లుగురి రాజీనామా….?

అమరావతి బ్యూరో, : తిరుపతి ఉప ఎన్నికలు ఏప్రిల్‌ 17న జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సరికొత్త వ్యూహానికి తెరలే పుతోంది. ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక, మే 2న లెక్కింపు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి వైకాపాకు మద్దతిస్తున్న నలుగురు శాసనసభ్యులతో రాజీనామా చేయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈమేరకు ఇంకా నిర్ణయం అధికారి కంగా ప్రకటించకపోయినా, వీరిని ఉప ఎన్నికలకు పంపి గెలిపించి, ఆ స్థానాలను కూడా పార్టీ ఖాతాలో వేసుకునే యోచనను పార్టీ, ప్రభుత్వ పెద్దలు చేస్తున్నట్లుగా సమాచారం. వీరిలో వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరామ్‌ (చీరాల) మద్దాల గిరి (గుంటూరు వెస్ట్‌), వాసుపల్లి గణేష్‌ (విశాఖ సౌత్‌) ఉన్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల ఫలితాల అనంతరం మరికొంత మంది తెదేపా ఎమ్మెల్యేలు వైకాపాతో టచ్‌లో ఉన్నారని, వారు కూడా తమకు మద్దతు ప్రకటించే అవకాశమున్నం దున తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అంశంపై తుది నిర్ణయం వెలువరించే అవకాశముందని పార్టీ సీనియర్‌ ఒకరు తెలిపారు. వేరే పార్టీలో ఉంటూ తమకు మద్దతు తెలిపే కన్నా..పదవికి రాజీనామాచేసి తమ పార్టీ తరపున గెలుపొందితే తమ పార్టీ బలం మరింతగా పెరుగుతుందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన 20 నెలల తరువాత పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మిగిలిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ మొదటి వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈనెల 31తో ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ కాలం పూర్తికానుండటం, ఆయన తన హయాంలో ఎంపీటీసీ, జడ్పీ టీసీ ఎన్నికలను నిర్వహిం చలేమని తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఈప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం 6 రోజలు వ్య వధిలో ఈ ప్రక్రియ పూర్తి కానుందని, దీనిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకో వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచం దన్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్ని కల ప్రక్రియలో కీలకమైన ఎన్నికల కమిషనర్‌ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి దాదాపు ఒ క స్థిర నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గత ఏడాది డిసెంబరు 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన నీలం సాహ్ని పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలు వడాల్సి ఉంది. ఇదే అంశాన్ని పార్టీలోని సీనియర్‌ నేతలు కూడా సూత్ర ప్రాయంగా అంగీకరిస్తున్నారు. నీలం సాహ్ని మహిళగా, సీనియర్‌ అధికారిగా ఈ పదవికి అర్హురాలని ప్రభుత్వం భావిస్తోందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. అమెను ఎస్‌ఈసీ పదవిలో కూర్చోబెట్టడం లాంఛన ప్రాయమేనని ఆ నాయకుడు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
రచ్చబండలో సీఎం జగన్‌
ఇదిలావుండగా ఏప్రిల్‌ నెలలోనే సీఎం జగన్‌ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్ప టికే ఈ అంశాన్ని పార్టీ పెద్దలకు తెలియజే యడంతోపాటు పెండింగ్‌ అప్లికేషన్లను పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా పార్టీలో అంతర్గత విబేధాలపై సీఎం జగన్‌ అక్కడికక్కడే నిర్ణయం తీసుకునే అవకాశ ముందని తెలుస్తోంది. ఇప్పటికే ఏ పథకమైనా తమకు అర్హత ఉండి రాలేదని ఎవరైనా చేయి పైకెత్తితే అధికారులపై చర్యలు తప్పవని సీఎం జగన్‌ హెచ్చరికలు జారీచేశారు. అయితే, తాజాగా ఆయన పార్టీ నేతలకు కూడా ఇదే తరహాలో హెచ్చ రికలు పంపుతున్నారు. విబేధాలతో పార్టీకి చెరపుచేసే పరి స్థితులు తన పర్యటనలో కనిపిస్తే అటువంటి వారిపై అక్క డికక్కడే నిర్ణయం తీసుకుంటానని, ఈలోగా విబేధాలను వీడి స్నేహ పూర్వ కంగా ప్రజలకు సేవచేసే కార్యక్రమంలో నిమగ్నమవ్వాలని ఆయన పార్టీ శ్రేణులకు సమాచారం అందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement