Sunday, April 28, 2024

Guntur – లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో ఐటి సోదాలు

గుంటూరు కొత్త‌పేట‌లోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.. ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నట్టు స‌మాచారం. సుమారు 30 మంది సిబ్బందితో నాలుగు బ్రాంచ్ లో సోదాలు జ‌రుపుతున్నారు… సిబ్బంది, రోగుల‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధించారు .. కొత్త రోగుల‌కు ప్ర‌వేశం లేకుండా గేటు వ‌ద్ద సెక్యూరిటీని నియ‌మించారు.. హాస్పిటల్ లోకి మీడియాని అనుమతించ లేదు.. సోదాలు అనంత‌రం పూర్తి స‌మాచారం ఇస్తామ‌ని ఐటి అధికారులు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement