Friday, May 17, 2024

Breaking: హైదరాబాద్​లో గన్​ ఫైర్​.. సొంత రివాల్వర్​తో కాల్చుకుని ఆత్మహత్య

హైద‌రాబాద్‌లోని చిక్క‌డ‌ప‌ల్లిలో గన్​ఫైర్​ జరిగింది. ఒక్కసారిగా కాల్పుల ఘటన జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే.. ఓ వ్య‌క్తి తన లైసెన్స్​డ్​ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృతుడిని క‌డ‌ప‌కు చెందిన న్యాయ‌వాది శివారెడ్డిగా గుర్తించారు. లైసెన్స్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్లు గమనించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement