Saturday, May 4, 2024

గుడివాడ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి – జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా


గుడివాడ : జులై 26( ప్రభ న్యూస్): ప్రజలకు ఎలాంటి సమస్య లేని పాలన అందించడం ఈ ప్రభుత్వ లక్షణమని గుడివాడ సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన అభ్యుదయ శాఖ కృష్ణాజిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆర్కే రోజా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె గుడివాడ గంగా గ్రాండ్యూర్ సమావేశ మందిరంలో గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని తో కలసి కలెక్టర్‌ పి. రాజాబాబు, జాయింట్‌ కలెక్టరు డాక్టర్ అపరాజితా సింగ్ తో సమీక్షా సమావేశం, అసైన్డ్ కమిటీ సమావేశం నిర్వహించారు.


  • తొలుత డ్వామా, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, గృహ నిర్మాణం,టిడ్కో, ఆర్ డబ్ల్యూ ఎస్, విద్యాశాఖ, రెవిన్యూ, వ్యవసాయం, నీటిపారుదల ,మత్స్యశాఖ, గుడివాడ మున్సిపాలిటీ, నీటిపారుదల, వైద్య ఆరోగ్యశాఖ, తదితర శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రగతి నివేదికలను ఈ సమావేశంలో వివరించారు.

  • అనంతరం మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వ పథకాలతో తాము ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని ప్రజలు తెలియజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగనన్న పై ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో అదే మాదిరిగా కొడాలి నాని అన్నకు అంతటి ప్రజాకర్షణ ఉందని మంత్రి రోజా కొనియాడారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను శాసనసభ్యులు నేరుగా తెలుసుకున్నారని, అదేవిధంగా జగనన్న సురక్ష పథకం ద్వారా 11 రకాల సర్టిఫికెట్లను పైసా ఖర్చు లేకుండా నేరుగా అందజేయడం ద్వారా ప్రజా హృదయాలలో ముఖ్యమంత్రి చిరస్థాయిగా నిలిచారన్నారు.
    గుడివాడ నియోజకవర్గంలో చేపట్టిన ప్రభుత్వ పథకాల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు సేకరించామన్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

  • ఈ సమావేశంలో మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్ తో పాటు
  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీ.డీ. జీ.వీ సూర్య నారాయణ,పంచాయతీరాజ్ ఎస్ ఈ విజయ కుమారి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ సత్యనారాయణ రాజు, గుడివాడ మునిసిపల్ కమిషనర్ మురళీకృష్ణ, గుడివాడ ఆర్డీవో పద్మావతి, మచిలీపట్నం ఆర్టీవో ఐ. కిషోర్, ఉయ్యూరు ఆర్డీవో విజయ్ కుమార్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement