Sunday, May 5, 2024

Breaking: సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎంకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆదివారం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత మేలు చేసినందుకు సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 

కాగా, మంత్రుల కమిటీతో ఉద్యోగుల చర్చ సఫలం అయిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగించనున్నారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్‌ఆర్‌ఏకి ప్రభుత్వం అంగీకరించింది.  
 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తించనుంది.

సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్‌ వరకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే, రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం, 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు చేయనున్నారు. పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగించనున్నారు.  ఇక, ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల చేయనున్నారు.  సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు చేయనున్నారు. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement