Wednesday, May 8, 2024

కర్నూలు కలెక్టరేట్ వద్ద కదంతొక్కిన ఉద్యోగులు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయ, పెన్షనర్స్, ఏపీఎస్ఆర్టీసీ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రాజ్ విహార్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వివిధ డిమాండ్లతో ప్లే కార్డులను ప్రదర్శించారు. మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలు సుమారు అరగంట పాటు నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజ్ విహార్ సెంటర్ నలువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు.

అసంబద్ధత పిఆర్సి రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ అంగీకారం మేరకు న్యాయపరమైన పిఆర్సి ఇవ్వాలని కోరారు. హెచ్ ఆర్ ఏ కుదించ వద్దని, డీఎలను వెంటనే విడుదల చేయాలనలనే ప్రధాన డిమాండ్లతో కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ తోపాటు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement