Sunday, March 3, 2024

ఎత్తిపోత‌ల‌కు మంచి రోజులు..

మూడు రాష్ట్రాల్లో అధ్యయనం
ఆయకట్టు రైతులతో కమిటీలు
త్వరలో కార్యాచరణకు సన్నద్ధం
మూలపడ్డ పథకాలకు వెూక్షం

అమరావతి, ఆంధ్రప్రభ: నదీ జలాల్లో ఏపీ కేటాయింపులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవటమే లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలన్నిటినీ సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర జలనవరుల శాఖ అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలో అనుసరిస్తున్న విధానాలను క్షేత్రస్థాయిలో అధికారుల బృందం పరిశీలిస్తోంది. ఏటా వరదల సమయంలో కృష్ణా, గోదావరిల నుంచి కొన్ని వందల టీ-ఎంసీలు సముద్రంలో కలుస్తుండగా..కనీసం కేటాయింపుల మేర-కై-నా చుక్కనీరు వృధా కాకుండా వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇటీ-వల జలవనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే మనుగడలో ఉన్న ఎత్తిపోతల పథకాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించటంతో పాటు- వివిధ కారణాల వల్ల మూలనపడిన ఫథకాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపట్టటం ద్వారా ఆయకట్టు- చివరి భూములకు సైతం నీరందించేందుకు అవకాశం ఉంటు-ందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎత్తిపోతల పథకాలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ లలో క్షేత్రస్థాయి అధ్యయనానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వానికి అధ్యయన నివేదిక అందిన అనంతరం ఎత్తిపోతల నిర్వహణఫై పూర్తిస్థాయి కార్యాచరణ ప్రారంభం కానుంది.

ఆయకట్టు- రైతులతో కమిటీలు
ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం ఆ పథకం పరిధి లోకి వచ్చే రైతులతో కమిటీ-లు ఏర్పాటు-చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఐడీసీ) పరిధిలో 1117 భారీ, మధ్య తరహా ఎత్తిపోతల పథకాలు ఉండగా వాటిలో 916 స్కీంలు పనిచేస్తున్నాయి..154 స్కీంలు నాన్‌ ఆపరేషన్‌ లో ఉన్నాయి. సూక్ష్మస్థాయి ఎత్తిపోతల పథకాలు 56 ఉండ గా 55 స్కీంలు పనిచేస్తున్నాయి. అధికారిక సమచారం మేరకు ఎత్తిపోతల పథకాల కింద 6.92 లక్షల ఎకరాల ఆయకట్టు- ఉంది. సుమారు 4 లక్షల మంది సన్న, చిన్న కారు రైతులు ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఎత్తిపోతల పథకాలు సమర్ధవంతంగా పని చేయని చోట ఆయకట్టు- రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు-న్నారు. ముఖ్యంగా ఆయకట్టు- చివరి భూముల రైతులు నీళ్ళొస్తాయో, రావో తెలియని సందిగ్ధ స్థితిని ఎదుర్కొంటూ సాగునీటితో ఎక్కువగా పనిలేని స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొందరయితే ఎత్తిపోతలను నమ్ము కుని సాగు ప్రారంభించి నీళ్ళు రాకపోవటంతో నష్టపో తున్నారు. అసలు స్కీంలు పనిచేయని చోట రైతులు మరిం త అగమ్య గోచరస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరహా ప్రతికూల పరిస్థితులన్నిటినీ పూర్తిస్థాయిలో అధిగమించేలా ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జలనవరుల శాఖ అదికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక వైపు విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తూ మరో వైపు నిర్వహణ, ఇతర మరమ్మతుల కోసం కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ఆయకట్టు-కు నీళ్ళను తరలించలేని పరిస్థితులు ఉత్పన్నం కాకూడదన్నది ప్రభుత్వ భావన. అందువల్లనే ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను ఆయకట్టు- రైతులకు అప్పగించేలా కమిటీ-లు ఏర్పాటు- చే యాలని అధికారులను ఆదేశించింది. మూడు రాష్ట్రా ల్లోని లిప్ట్‌n ఇరిగేషన్‌ స్కీంలలో అనుసరిస్తున్న విధానాలపై ప్రభుత్వానికి నివేదిక అందిన అనంతరం నూతన మార్గ దర్శకాలతో ఎత్తిపోతల పథకాల నిర్వహణ ప్రారంభం కానుంది..ఆయకట్టు-లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా కార్యాచరణ అమలు కానుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement