Saturday, April 20, 2024

ఆపద సమయంలో పేద‌ల‌కు అండగా సీఎంఆర్‌ఎఫ్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి : ఆపదలో ఉన్న సమయంలో వైద్యానికి ఖర్చులు లేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 174 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 86,62,500 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు, అనారోగ్యానికి గురైన, వ్యాధుల బారిన పడ్డ పేదల ప్రజలు వైద్యం చేయించుకునే స్థోమత లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ఒక వరంగా మారిందన్నారు. పేద ప్రజలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్‌ పర ్సన్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement