Wednesday, May 1, 2024

ఎపి ,తెలంగాణాలో మ‌ధ్య గోదావ‌రి ల‌డాయి..

అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణా జలాల పంపిణీపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదం జటిలమవుతున్న నేప థ్యంలో ఇంతకాలం గుంభనంగా ఉన్న గోదావరి నీటి పంప కాలపై కూడా రెండు రాష్ట్రాల్ర మధ్య తీవ్రస్థాయి విభేదాలు నెలకొంటు-న్నాయి. రోజుకు రెండు టీ-ఎంసీల గోదావరి జలా లను తరలించేందుకు వీలుగా కాళేశ్వరంకు చట్ట విరుద్ధంగా అనుమతులిచ్చారని ఎప్పటి నుంచో వాదిస్తున్న ఏపీ ఇపుడు మూడో టీ-ఎంసీకి తెలంగాణ డీపీఆర్‌ అందించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరిలో నీటి వాటాలు తేల్చకుండా తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు అనుమతులివ్వ వద్దని కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్‌ కుమార్‌కు ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ రాసిన తాజా లేఖ రెండు రాష్ట్రాల్ర మధ్య నెలకొన్న గోదావరి జల వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది.

ఈ నేపథ్యంలో గోదా వరి జలాలపై ఏపీకి ఉన్న హక్కులను రక్షించుకునే విషయం లో రాజీలేని ధోరణితో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర జలశక్తి సంఘం (సీడబ్ల్యుసి), కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నీటి పంపిణీ విషయంలో జోక్యం చేసుకుంటు-న్నప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాకుండానే మిగిలిపోతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు గోదావరి జలా లను పున:పంపిణీ చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ్ర ఇంతవరకు ప్రారంభం కాలేదు. గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు- చేయటం తో పాటు- రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని ఏపీ డిమాండ్‌ చేస్తోం ది. రెండు రాష్ట్రాల్రు ప్రతిపాదనలు పంపితే అంతర్‌ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం ట్రిబ్యునల్‌ ఏర్పాటు-చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెబుతున్నా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గోదావరిలో నీటి లభ్యత 75 శాతం కన్నా అధికంగా ఉన్న అన్ని సమయా ల్లో వాటిపై పూర్తి హక్కులను దిగువ రాష్ట్రాలకే ఇవ్వాలని ఏపీ వాదిస్తోంది. అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాలను పరిష్క రించే క్రమంలో బచావత్‌ -టైబ్యునల్‌ కూడా గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. 2014 తరువాత..అంటే రాష్ట్ర పునర్విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో పూర్తయిన ప్రాజెక్టులతో పాటు- నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాతిపదికగా తీసుకుని నీటి పంపిణీ చేయాలని ఏపీ వాదిస్తోంది.

-టైబ్యునల్‌ ఎప్పుడు..!
గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వాటాగా దక్కిన జలాలను పునర్విభజన నేపథ్యంలో 2014 తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్రకు కేటాయింపులు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. దీని కోసం గోదావరి జల వివాదాల -టైబ్యున ల్‌ (జీడబ్ల్యూడీటీ-) ఏర్పాటు- చేయాల్సి ఉన్నా కార్యాచరణలో గడిచిన పదేళ్ళుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2020 అక్టోబరు 6న నిర్వహించిన కేంద్ర జలశక్తి అపెక్స్‌ కౌన్సిల్‌ లో గోదావరి -టైబ్యునల్‌ ఏర్పాటు- చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరారు. ట్రిబ్యునల్‌ ఏర్పడకుండా, నీటి వాటాలు తేలకుండా తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతల, చనాకా- కొరటా, కాళేళ్వరం (రెండు టీ-ఎంసీ) పథకాల అనుమతు లను రద్దు చేయాలని కూడా అపెక్స్‌ కౌన్సిల్‌లో రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. అప్పటి నుంచి గోదావరి బోర్డు సమావేశాల్లోనూ ఏపీ అధికారులు తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు.

గోదావరిలో 1238 టీ-ఎంసీలు
గోదావరిలో ఏపీ వాటా కింద 1238.436 టీ-ఎంసీలు కావాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ను అనుసరించి గోదావరి బేసిన్‌ కు దిగువన ఉన్న ఏపీకి మిగులు జలాలపై సంపూర్ణ హక్కు లున్నాయి.. నిర్మాణంలో ఉన్న పోలవరంతో పాటు- ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు బచావత్‌ ట్రిబ్యునల్‌ గతంలోనే 737.153 టీ-ఎంసీలను కేటాయించింది. 75 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుని ఇపుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 165 టీ-ఎంసీలు అవసరం. వరదల జలా లపై తమకున్న హక్కును వినియోగించుకుని మరో 336 టీ-ఎంసీలను వినియోగించునే సామర్దంతో ప్రాజెక్టులు నిర్మిసా ్తమని ఏపీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా గోదావరి జలాల్లో 1238.436 టీ-ఎంసీలను ఏపీకి దక్కుతాయని అంచనా. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి వాటాలతో సంబంధం లేకుండా అనుమతులిస్తే గోదావరికి దిగువ రాష్ట్రంగా ఉన్న తమ ప్రాంతం సాగు, తాగునీటి ప్రయోజనా లు దెబ్బతింటాయని ఏపీ జలవనరుల శాఖ అధికారులు ఇప్ప టికే కేంద్ర జలశక్తికి సమగ్ర వివరాలతో నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చేపడుతున్న కొత్త ప్రాజెక్టులు, డీపీఆర్‌ ల పరిశీలనపై కేంద్ర జలశక్తి తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఏపీ క్రియాశీలకమైన తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement