Monday, April 29, 2024

Vizag: మధురవాడలో గ్యాస్ లీక్.. నలుగురికి తీవ్రగాయాలు

మధురవాడ వాంబే కాలనీలో గ్యాస్ లీక్ అవ్వడంతో నలుగురికి తీవ్రగాయాలైన ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యింది. గ్యాస్ లీక్ అవుతుందని రెగ్యులేటర్ ఆఫ్ చేసినా అదుపులోకి రాలేదు.

గ్యాస్ లీకేజీని అదుపులోకి తేవడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా మంటలు రావడంతో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమచారం ఇవ్వడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో యామల బాలరాజు, యామల చిన్ని, యామల గిరి, యామల కార్తీక్ అనే నలుగురు గాయపడ్డారు. గాయాలపాలైన వారిని 108 లో కేజీహెచ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement