Monday, April 29, 2024

మరో మైలురాయిని చేరుకున్న గంగవరం పోర్ట్‌.. ఎందుకో తెలుసా?

గాజువాక, (విశాఖ) ప్రభ న్యూస్‌: దేశంలో అత్యంతలోతైన, అత్యాధునిక నౌకాశ్రయాలలో ఒకటైన గంగవరం పోర్ట్‌ మరో మైలురాయిని చేరుకుంది. అతిపెద్ద డిస్‌ప్లేస్‌మెంట్‌ వెస్సల్‌ను బెర్తింగ్‌ చేసింది. ఈ వెస్సల్‌ ఎంవీ మరన్‌ ఫిడెలిటీ- 2,21,083 మెట్రిక్‌ టన్నులు, 1,85,000 మెట్రిక్‌ టన్నుల కార్గో పార్శిల్‌ను అదానీ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్‌ తరపున తీసుకువచ్చింది. గంగవరం పోర్ట్‌ వద్ద ఇప్పటి వరకూ నిర్వహించిన అత్యధిక డిస్‌ప్లేస్‌మెంట్‌ 2,05,429 మెట్రిక్‌ టన్నులు కాగా దీనిని ఈ జీపీఎల్‌ అతి సులభంగా అధిగమించింది. ఎంవీ మరన్‌ ఫిడెలిటిను విజయవంతంగా బెర్త్‌ చేయడమనదన్నారు. భారీ నౌకలను సైతం పోర్ట్‌ వద్ద నిర్వహించే సామర్థం వెల్లడించడం మాత్రమే కాదు, భారత ఉపఖండం వ్యాప్తంగా వాణిజ్యం మెరుగుపరచడంలో జీపీఎల్‌ పాత్రను పునరుద్ఘాటిస్తుంది.భారీ పరిమాణంలోని నౌకలను జీపీఎల్‌ కొనసాగించడంతో పాటుగా భారతీయ కార్గోలకు ప్రాధాన్యతా, గేట్‌వేగా తమ స్ధానం పునరుద్ఘాటిస్తోంది. ఈ పోర్ట్‌ అత్యధిక లోతుతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందించడంతో పాటుగా మల్టీ పర్పస్‌ కార్గో బెర్త్స్‌ను సైతం అందిస్తుందని పోర్టు అధికారులు తెలిపారు.

ఇవి వేగవంతంగా కార్గో కదలికలకు తోడ్పడతాయి. వైవిధ్యమైన బల్క్‌ మరియు బ్రేక్‌ బల్క్‌ కార్గో గ్రూప్స్‌ కోసం సమర్థవంతమైన కార్గో హ్యాండ్లింగ్‌ సేవలను వినియోగదారులకు అందిస్తుంది.మా టీమ్‌ చేరుకున్న విజయం మరియు నూతన లక్ష్యాలను చేరుకోవడంలో వారి దృష్టి పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. భారీ కార్గో పార్శిల్స్‌ మరియు వెస్సల్స్‌ను నిర్వహించే అసాధారణ సామర్థం మరియు అత్యాధునిక మౌలిక వసతులు గంగవరం పోర్ట్‌కు ఉన్నాయి. ఈ పోర్ట్‌ తో పాటుగా దాని సంబంధిత సదుపాయాలు, మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ వ్యవస్ధలు ఆసియాలో అత్యాధునికమైనవి. భద్రత పరంగా అత్యున్నత ప్రమాణాలనూ కలిగి ఉన్నాయి. నిరంతర దృష్టి, వృద్ధి అభివృద్ధి తో గంగవరం పోర్ట్‌ ఇప్పుడు నూతన శిఖరాలను కార్గో నిర్వహణ పరంగా చేరుకోగలదని నమ్మకంతో ఉన్నాము” అని గంగవరం పోర్ట్‌ అధికార ప్రతినిధి ఈ సందర్బంగా కొనియాడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement