Monday, April 15, 2024

Srisailam: బోనుకు చిక్కిన ఎలుగుబంటి

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పరిధిలో గల శిఖరేశ్వరం సమీపంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు ఇవాళ ఉదయం పట్టుకున్నారు. గత రెండు రోజుల నుంచి శిఖరం సమీపంలో ఎలుగుబంటి సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.

తిరుపతిలో జరిగిన ఘటనల దృష్ట్యా శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిఖరేశ్వరం సమీపంలో మూడు బోన్లను ఏర్పాటు చేశారు. శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరించడంతో అధికారులు, భక్తులను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్‌ చాంగ్‌ తెరాన్‌ అప్రమత్తం చేశారు. దీంతో ఎలుగుబంటి బోనులో చిక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement