Tuesday, September 19, 2023

Editorial – ప్ర‌కృతి వినాశ‌నం వల్లే విపత్తులు …

హిమాలయ రాష్ట్రాలపై ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా భారీ వర్షాలు పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాల ను కలిగిస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రకృతి ప్రళయా నికి ఎక్కువ దెబ్బతింది. విరామం లేకుండా పడిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. పర్వత సానువుల్లో కట్టిన ఇళ్ళు పేకమేడల్లా కూలిపోయాయి. వర్షాలు, వరదలు వరుసగా రెండుసార్లు సంభవించడం వల్ల ఆస్తి, ప్రాణనష్టం ఎంతో లెక్కించే అవకాశం కూడా సిబ్బందికి కలగడం లేదు. చార్‌ధామ్‌ యాత్రలకు బయ లుదేరిన ప్రయాణీకులు మార్గమధ్యంలో పలు చోట్ల చిక్కుకున్నారు. ఎస్‌ఆర్‌డీఎఫ్‌ వంటి ప్రత్యేక దళాలను రంగంలోకి దింపినా యాత్రికులను రక్షించేందుకే వారి సేవలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. కొండ చరియలు విరిగి పడిన చోట కూలిన ఇళ్ళల్లో ఎందరు మరణిం చారో లెక్కలు తేలడం లేదు. ఎక్కడికక్కడ వారు సజీవ సమాధి అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే లెక్కలకు అక్కడ వాస్తవంగా సంభవిస్తున్న మరణాలకూ పొంతన లేదు. అలా లెక్కలు తేల్చడం ఎవరికీ సాధ్యం కాదు.

సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలో శివాలయం కుప్పకూలడంతో అనేక మంది భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఆలయంపై కొండచరియలు విరిగిపడుతుంటే ప్రభుత్వ యంత్రాంగ మంతా నిమిత్తమత్రంగా చూస్తూ ఉండిపోడ తప్ప ఏ కొంచెం రక్షణ చర్యలకైనా ఆస్కారం ఇవ్వని రీతిలో మెరుపు దాడే జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ప్రాణా లు కోల్పోయారు. గతంలో ఇలాంటి ప్రమాదం ఎప్పు డూ చూడలేదని స్థానికులు అంటున్నారు. భారీ వర్షాలకు కళ్ళముందే వందలాది ఇళ్ళు వరదలో కొట్టుకుని పోయాయి. చెట్లు, కరెంట్‌ స్తంభాల సంగతి సరేసరి. హిమాచల్‌ప్రదేశ్‌లో 12 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల న్నింటిలో విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం కొండల తవ్వకం ఇష్టారాజ్యంగా సాగింది. ఇంకా సాగుతోంది. వీటివల్లే కొండ చరియలు అధిక సంఖ్యలో విరిగి పడుతున్నాయ ని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర హిమాలయ రాష్ట్రాల్లో జలవి ద్యుత్‌ ప్రాజెక్టులకు నిరభ్యంతరంగా అనుమతులు ఇచ్చారు. ఈ విద్యుత్‌ ప్రాజెక్టులన్నింటికీ జాతీయ బ్యాంకులు పెద్దఎత్తు న రుణాలు ఇచ్చాయి. హిమాలయ ప్రాంతాల్లో నిర్మించే మెగా ప్రాజెక్టులు అభివ ృద్ధి మాటేమో గానీ, పునాదులను కదిలిస్తున్నాయనడానికి హిమాచల్‌ ప్రదేశ్‌లో కూలుతు న్న భవనాలు, ఇళ్ళే నిదర్శనం. అభివృద్ధి అవసరమే కానీ, పర్యావరణ సమతూక స్థితిని కాపాడకపోతే వినాశ నం తప్పదని హిమాచల్‌ ప్రమాదాలు రుజువు చేస్తున్నా యి.

- Advertisement -
   

రెండు నెలల వ్యవధిలో పది వేల కోట్ల రూపాయిల విలువైన ఆస్తులు నేలమట్టం అయ్యాయి. ఈ లెక్కలు కూడా సరైనవి కావు. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఆదాయం విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారానేనన్నది యదా ర్థమే. కానీ, నిర్మాణ దశలోనే ఈ ప్రాజెక్టులు కూలిపోతు న్నాయి. సివ్లూ, కశౌలీ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా ర సంస్థలకు వందల ఎకరాలను ప్రభుత్వాలు కేటాయిం చాయి. గతంలో కాంగ్రెస్‌ నాయకులు ముడుపులకు అలవాటుపడి ఈ వ్యాపార సంస్థలను ప్రోత్సహించాయ ని బీజేపీ నాయకులు ఆరోపించేవారు. ఇప్పుడు వారి హయాంలో కూడా యథాతథ స్థితి కొనసాగుతోంది. లైసెన్సులు, ఎన్‌ఓసీలు (నోఅబ్జెక్షన్‌సర్టిఫెకెట్లు) సంపాదిం చడం అప్పటికన్నా ఇప్పుడు సులభమని ఆ వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. వేసవి విడిదులుగా పేరొందిన కులు, మనాలీ వంటి ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అధునాతన హర్మ్యాలను నిర్మిస్తు న్నారు. సినిమా షూటింగ్‌లకు వచ్చే వారికి ఇక్కడ విశ్రాం తి గృహాలను నిర్మిస్తున్నారు. భారీ వర్షాలకు నాలుగు వరుసల మనాలీ జాతీయ రహదారి 40 శాతం రెండు రోజుల వ్యవధిలోనే కొట్టుకు నిపోయింది. అనేక భారీ వాహనాలు, ట్రక్కులు నీట మునిగి నిలిచిపోయాయి.

ఆదాయ మార్గం కోసం ఇలాంటి ప్రదేశాల్లో రిసార్టులను నిర్మిస్తున్నారు. వీటివల్ల కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు నెలల స్వల్ప వ్యవధిలో 170 సార్లు కుంభవృష్టి కురవడం అంటే ఎంత విషాదకరమో స్పష్టం అవుతోంది. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తుం డటం వల్ల ప్రత్యేక రక్షణ బృం దాలు వాటిపైనెె దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. అవి రంగం లో దిగుతుండటం వల్లనే ప్రకృతి వైపరీత్యాలకు ప్రాణ నష్టం నివారించ బడుతోంది.పెట్టుబ డులు పూర్తిగా పెట్టక ముందే, బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించకముందే ఈ ప్రాంతంలో భారీ పెట్టుబ డులు పెట్టామని చెప్పి కార్పొరేట్‌, సంపన్న వర్గాలు అటు బ్యాంకులకు ఎగనా మం పెడుతూ, ఇటు బీమాసంస్థల నుంచి పెద్దమొత్తం లో నిధులు వసూలు చేస్తున్నాయి. అంతిమంగా, ఉపాధి కోసం అంతదూరం వెళ్ళిన పేదలు, స్థానికుల్లో బీదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రగతి పేరిట ప్రకృతిని నాశనం చేస్తే ఇలాంటి విపత్తులు తప్పవని మరోసారి రుజువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement