Monday, April 29, 2024

Follow Up – స్మగ్లర్ల దాడిలో మరణించిన కానిస్టేబుల్ కు రూ.30 లక్షలు నష్ట పరిహారాన్ని ప్రకటించిన జగన్

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమం లో స్మగ్లర్ల వాహనం ఢీ కొని కానిస్టేబుల్ గణేష్ (32) మృతి చెందినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణా రావు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

టాస్క్ ఫోర్స్ కు అందిన సమాచారం మేరకు ఆర్ ఎస్ ఐ విశ్వనాథ్, వినోద్ టీమ్ లు సోమవారం రాత్రి అన్నమయ్య జిల్లా కే వి పురం సుండుపల్లి మార్గం లో తనిఖీలు నిర్వహించారు. స్మగ్లర్లు వస్తారనే సమాచారం ఉండటంతో గుండ్రేవారిపల్లి ప్రాంతంలో మాటు వేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్విఫ్ట్ వాహనం రాగా దానిని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు కారు ఆపకుండా వేగం పెంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనాన్ని ఆపుదామని ప్రయత్నించిన గణేష్ గుద్ది వేగంగా వెళ్లి ఒక పల్లపు ప్రదేశంలో వాహనం వెళ్లి ఆగిపోయింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని పట్టుకునెందుకు ప్రయత్నించారు

.దీంతో కారులో నుంచి దూకి డ్రైవర్ సహా ముగ్గురు పారిపోగా, ఇద్దరిని పట్టుకున్నారు. వీరిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. పారిపోయిన వారికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కారులో లభించిన 7 దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన గణేష్ ను పీలేరు ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రిలో వైద్యులు తెలిపారు.

సంఘటన స్థలానికి ఎస్పీలు కృష్ణారావు, శ్రీనివాస్ చేరుకుని పతిస్థితి సమీక్షించారు. ఆసుపత్రికి చేరుకుని గణేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని గణేష్ భౌతిక కాయానికి అంజలి ఘటించారు.

రూ. 30 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

- Advertisement -

గణేష్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గణేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. రూ. 30లక్షలు ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement