Sunday, May 5, 2024

సోమశిలకు పోటెత్తుతున్న వరద నీరు.. 7 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

అనంతసాగరం, (ప్రభన్యూస్‌): సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి శుక్రవారం సాయంత్రానికి 88వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతునట్లు- ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి 18 వేల క్యూసెక్కులు వస్తున్న వరద ప్రవాహం కాస్త ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం ఉదయం నుంచి పెరిగి సాయంత్రానికి 88వేల క్యూసెక్కులుగా నమోదైంది.

ఈ నేపథ్యంలో దిగువకు 4,5,6,7,8,9,10 క్రస్ట్‌గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలు, జిల్లాలో కురుస్తున్న వర్షాలతో శనివారం నాటికి వచ్చే వరద నిలకడగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నట్లు- అధికారులు అంచనాలు వేస్తున్నారు. సోమశిల జలాశయంలో 99.852 మీటర్లతో, 72.515 టీ-ఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు- అధికారులు వివరించారు.

సోమశిల జలాశయానికి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌ఈ వెంకటమణారెడ్డి శుక్రవారం సందర్శించారు. క్రస్ట్‌గేట్ల పనితీరు వ్యవస్థను పరిశీలించి ఇంజనీర్లకు పలు సూచనలు అందజేశారు. ప్రస్తుతం జలాశయం నుంచి దిగువకు భారీగా వదులుతున్న వరదతో పొర్లు కట్టలు, రివి-ట్‌మెంట్‌ కట్టడాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అనే అంశంపై ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని, క్రస్ట్‌ గేట్ల పనితీరుని గమనిస్తూ దిగువకు నీటిని సరఫరా చేయాలని అధికారులను ఎస్‌ఈ ఆదేశించారు. ఈయన వెంట డీఈ మహేశ్వర్‌, ప్రాజెక్ట్‌ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement