Wednesday, April 24, 2024

ఢిల్లీలో టీ.కాంగ్రెస్ నేతలు.. హైకమాండ్ చర్యలుంటాయా?

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ పోస్ట్ మార్టమ్ మొదలు పెట్టింది. ఈ ఎన్నికల్లో 3 వేలకు పరిమితం కావడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.  దీనిపై కాంగ్రెస్‌ పార్టీలో దుమారమే రేగింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ కొందరు సీనియర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం ఆదేవించింది. ఈ నేపథ్యంలో టీ.కాంగ్ నేతలు హస్తిన బాట పట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌, వీహెచ్‌ ఢిల్లీకి పయనం అయ్యారు. రాహుల్‌ గాంధీతో పాటు ఇతర నేతలతో సమావేశం కానున్నారు.

హుజురాబాద్‌ ఎన్నికల్లో ఎవరెవరు ఏం చేశారు? పార్టీకి నష్టం కలిగించిన అంశాలు ఏంటి? ఇలా అన్ని అంశాలతో నివేదికతో రావాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యలో ఓటమిపై నివేదికతో హస్తినకి వెళ్లినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక  జరిగిన తొలి ఎన్నిక కావడంతో ఆయనపై కొందరు సీనియర్లు ఫిర్యాదు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం నేతలపై చర్యలు తీసుకుంటుందా? లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా? అన్నది ఉత్కఠంగా మారింది.

ఇది కూడా చదవండి: weather report: ఏపీకి వాన గండం.. దూసుకొస్తున్న ‘జవాద్‌’ తుపాన్‌!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement