Sunday, April 14, 2024

శ్రీశైలం డ్యామ్‌కు పోటెత్తుతున్న వరద.. 10 గేట్ల ద్వారా దిగవకు నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున‌ వరద చేరుతుంది. దీంతో జలాశయానికి ఉన్న చెందిన 10గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,60,802 క్యూసెక్కులుగా ఉంది. ఇక దిగువకు 3,85,809 క్యూసెక్కులు వెళ్తుంది. జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ‌ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం-215.3263 టీఎంసీలు నిల్వ చేశారు.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి
కొనసాగుతుంది. ఇందులో ఏపీ పరిధిలో 29,262 క్యూసెక్కుల నీటిని వినియోగించి 14.643 మెగా యూనిట్లు, తెలంగాణ పరిధిలో 37,595 క్యూసెక్కుల నీటి వినియోగంతో 17.034 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు ఏపీ పరిధిలోని హెచ్ ఎన్ ఎస్ ఎస్ 141, పోతిరెడ్డిపాడు నుంచి 10000,
తెలంగాణ పరిధిలోని కల్వకుర్తికి 800 క్యూసెక్కులు, ఇక స్పిల్ వే గేట్ల్ ద్వారా 2,06,906 క్యూసెక్కుల నీరు దిగువకు విడుద‌ల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement